రంగారెడ్డి

పాఠశాలకు రాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 17: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా పాల్పడటం హేయమైన చర్య అని కౌన్సిలర్లు మహమూదాబేగం, రషీదాబేగం ఆరోపించారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ ఉన్నత పాఠశాల నుండి ఆర్‌డిఓ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయులు వర్గపోరుకు దిగి విద్యార్థులకు పాఠ్యంశాలు చెప్పడం లేదని ఆరోపించారు. పాఠశాలకు హాజరు కాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు పెట్టుకొని వెళ్తున్నారని పేర్కొన్నారు. పాఠ్యంశాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు ఇలా ఘర్షణ పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తూ పాఠశాల సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినుల పట్ల అసభ్యంగా మాట్లాడటం..చులకనగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీచర్లపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వెంటనే బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల మధ్య
సమన్వయలోపం
ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వీరాచారి తెలిపారు. ఘర్షణకు పాల్పడిన శంకరయ్య, మధులత, రాములు, రామ చంద్రమ్మ, జయప్రకాష్, శ్రీనివాస్‌కు మెమోలు ఇచ్చినట్లు వివరించారు.
జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనల్లో కూడా ఉపాధ్యాయులకు నచ్చజెప్పామని, కానీ ఉపాధ్యాయుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు విస్మరించిన టిఆర్‌ఎస్
వికారాబాద్, జనవరి 17: గత ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిని పోటీలో నిలబెట్టకుండా గతంలో ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన వారిని టిఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉంచి అధికార పార్టీ ప్రతినిధులుగా చేయడంతో ఉపాధ్యాయుల సమస్యలను విస్మరించారని బిజెపి శాసనమండలి సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో మాట్లాడరు.