రంగారెడ్డి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 19: రోడ్డు భద్రతలను పాటించక పోవడంతో యువత విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అడిషనల్ ట్రాఫిక్ డిసిపి దివ్యచరణ్ తెలిపారు. మండల పరిధిలోని ఇన్ఫోసిస్ కంపనీలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. అతి వేగం ప్రమాదకరమని తెలిసినా అదే చేస్తు ప్రాణాలు కోల్పోయి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి వేగం పనికి రాదని, పోయిన ప్రాణం తిరిగిరాదని, దిన్ని దృష్ఠిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతలను పాటించాలని కోరారు. వాహనాన్ని నడిపే ముందు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ పట్ల నిర్లక్ష్యం చేయరాదని, సెల్‌పోన్ డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. మల్కాజిగిరి ఏసిపి సందీప్ మాట్లాడుతూ ఎన్నో విజయాలు సాదించి ఉజ్వల భవిష్యత్‌ను ఎంచుకునేందుకు కృషి చేయాల్సిన యువత అతి వేగంతో ప్రయాణించి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ ఏసిపి శర్మ, ఘట్‌కేసర్ ఇన్స్‌స్పెక్టర్ బి.ప్రకాష్, ఇన్ఫోసిస్ కంపెనీ అధికారులు, ఎస్‌ఐ లు లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌లో..
షాద్‌నగర్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. గురువారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో 28వ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించారు. పట్టణ ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. టౌన్ సిఐ రామకృష్ణ ఎస్‌ఐలు నారాయణసింగ్, దాస్ పాల్గొన్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని అల్వాల్ ట్రాఫిక్ సిఐ నర్సింహారెడ్డి సూచించారు. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం మేడ్చల్ ఆర్‌టిసి డిపోలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించి సహకరించాలని కోరారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్: వాహనదారులు రోడ్డు భద్రతను పాటించి ప్రమదాల నివారణకు సహకరించాలని వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ లతామాధురి సూచించారు.
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుండి ఆలంపల్లి దర్గా వరకు పోలీసులు బైక్‌ర్యాలీ, విద్యార్థులు, వాహనదారులు కాలినడక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో 150 మంది పోలీసులు, 400 మంది విద్యార్థులు, వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి, ఆర్‌ఐ క్రాంతికుమార్, ఎస్‌బిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఖాతాదారులకు బ్యాంకుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు
తాండూరు, జనవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో ఇక ముందు ఖాతాదారులకు ఆన్‌లైన్ సేవలు అందించబడుతాయని తెలంగాణ గ్రామీణ బ్యాంకుల డిజిటల్ కోఆర్డినేటర్ ఎ.సతీష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తాండూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్-1లో బ్యాంకు ఖాతాదారులకు, రైతులకు, మహిళా పొదుపు స్వయం సహాయక గ్రూపులకి డిజిటల్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ టిజిబి తాండూరు బ్రాంచ్ మేనేజర్ జయరాజ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు వాణిజ్యబ్యాంకులతోపాటు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ వంటి ప్రయివేటు బ్యాంకుల్లో సైతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అమలవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఖాతాదారుడు, రైతులు మహిళాసంఘాలు తమ ఖాతాలను నేరుగా సక్రమంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా సేవలు పొందాలంటే అందుకు ఆన్‌లైన్, డిజిటల్ పరిజ్ఞానం ఆవశ్యకత ఉందని తెలిపారు. ఏటిఎం ద్వారా రోజుకు రూ.10వేలు పొందవచ్చునని, ప్రతిసారీ రూ.5000 చొప్పున డ్రా చేసుకునే సదుపాయం ఉందని చెప్పారు. ఏటిఎంలు, ఇంటర్‌నెట్, మోబైల్ యాప్‌లు మూడు రకాలుగా బ్యాంకు లావాదేవిలు ఇక ముందు అమలవుతున్నట్లు తెలిపారు. పంట రుణాలు, పంట నష్ట పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీలు డిజిటల్ రూపంలో ఇస్తారని చెప్పారు. పెళ్లిళ్లు, పేరంటాలు ఇతరాత్ర కార్యక్రమాలకు అవసరమైన మనీ ట్రాన్స్‌ఫర్ విధానం అమలవుతుందని తెలిపారు. చేతికి డబ్బులు అందటం లేదని ఎవ్వరూ బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. అవగాహన కార్యక్రమంలో తాండూరు టిజిబి ఖాతాదారులు, స్థానిక వ్యాపారులు, రైతు ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు గోపాల్‌రెడ్డి హామీద్ మియా, వెంకట్‌రెడ్డి, కిష్టప్ప, జె.లక్ష్మయ్య, ఎన్.శివకుమార్, టి.క్రిష్ణ, పట్లోళ్ళ అంజమ్మ, కృష్ణారెడ్డిలతోపాటు, టిజిబి బ్యాంకు సిబ్బంది రాజేందర్‌రెడ్డి,ముత్యాలప్ప, గీత, రాజిరెడ్డి రాంచందర్, నారాయణ, క్రిష్ణ, శ్రీనివాస్ పాల్గోన్నారు. అనంతరం డిజిటల్ కోఆర్డినేటర్ ఎ.సతీష్ కుమార్ టిజిబి బ్యాంకు ఖాతాదారులకు ఏటియం కార్డులు పంపిణీ చేశారు.