రంగారెడ్డి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జనవరి 19: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికిడి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు 467 గ్రాముల బంగారాన్ని తీసుకువచ్చిన్నట్లు గుర్తించి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్వాధీనం చేసుకొని అతన్ని విచారణ నిమిత్తం నగరంలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు .
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
నలుగురు టీచర్లకు షోకాజ్ ఉపాధ్యాయుల గొడవపై విచారణ
షాద్‌నగర్, జనవరి 19: ఉపాధ్యాయులు గొడవ పడి దుర్భాషలాడుకున్న ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడమే కాకుండా నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ రంగారెడ్డి జిల్లా డిఇఓ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ నెల 11వ తేదిన ఫరూఖ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గొడవ పడి దుర్భాషలాడుకున్న సంఘటన విధితమే. విచారణ జరిపిన డిఇవో సత్యనారాయణరెడ్డి ఇద్దరు ఉపాధ్యాయులు శంకరయ్య, మధులతను సస్పెండ్ చేస్తూ మరో నలుగురు ఉపాధ్యాయులు రామచంద్రమ్మ, రాములు, శ్రీనివాసులు, జయప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు విడుదలైనప్పటి నుండి విచారణ పూర్తి అయ్యే వరకు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌లో ఉంటారని ఆదేశాలలో పేర్కొన్నారు.షాద్‌నగర్ ఎంఇఓ శంకర్ రాథోడ్ ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్, నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని ధ్రువీకరించారు.