రంగారెడ్డి

సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 20: ప్రమాదవశాత్తు ఓ పరిశ్రమలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అజిత్ సింగ్ (23), చిన్నాన్న అయిన బిజయ్ సింగ్ (32) కొంతకాలం క్రితం నగరానికి బ్రతుకుదెరువు నిమిత్తం వచ్చారు. జీడిమెట్ల పారిశ్రామికవాడ ఫేజ్- 1లోని ఎక్సెల్ ఓవెల్ స్యాక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో అజిత్‌సింగ్, బిజయ్ పనిచేస్తారు. పరిశ్రమ రూమ్‌లోనే నివాసముండే అజిత్ సింగ్ నైట్ డ్యూటీ చేసి శుక్రవారం ఉదయం పరిశ్రమలోని సెప్టిక్ ట్యాంక్ స్లాబ్ పై నిలబడి బ్రెష్ చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్యాంక్‌పై స్లాబ్ విరిగిపోవడంతో అజిత్ సింగ్ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. అది గమనించిన చిన్నాన్న బిజయ్.. అజిత్ సింగ్‌ను కాపాడేందుకు సెప్టిక్ ట్యాంక్‌లో దిగాడు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్‌లో గ్యాస్‌కు ఊపిరి ఆడకపోవడంతో అజిత్‌సింగ్, కాపాడేందుకు దిగిన బిజయ్ సైతం దుర్మరణం చెందాడు.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి : కలెక్టర్

ధారూర్, జనవరి 20: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గురుదోట్ల గ్రామ పంచాయతీలో ఉపాధిహామీ పనులను పరిశీలించారు. రాష్ట్రంలోనే అత్యదికంగా పనులు కల్పించినట్లు రికార్డులు నమోదుచేసుకోవడం మంచి పరిణామమన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పలువురిని పలు అభివృద్ధి కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకుని సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా పేరు తెచ్చుకోవాలన్నారు. గ్రామం పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉందని అభివృద్ధిలో వెనకబడి ఉందన్నారు. గ్రామానికి ఆనుకొని బొంరాస్‌పేట్ మండలం ఉందని ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇతర గ్రామాలకు, మండలాలకు కూడా తెలియాలన్నారు. గ్రామంలో సిసి రోడ్లు లేకపోవడంపట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రతి గ్రామానికి స్మశానవాటికకు స్థలాలను గుర్తించి నివేదికలు పంపాలన్నారు. అంపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరగా జిల్లాలో 394 కేంద్రాలకు పక్కా భవనాలు లేవని వాటన్నింటికీ నిధులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో గురుదోట్ల గ్రామానికి ఆర్‌టిసి అధికారులు బస్సు నడిపేవారని ప్రస్తుతం బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొంతమంది విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్‌టిసి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
గ్రామ పంచాయతీ కార్యాలయ చుట్టుప్రక్కల చెత్తా చెదారంతో పాటు పెంట కుప్పలు ఉండడంతో ఇదేమిటని సర్పంచ్ సువర్ణను ప్రశ్నించారు. గ్రామం అభివృద్ధికి చాలా దూరం ఉందని నిధులు లేక ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర మంత్రి గ్రామానికి వచ్చినప్పుడు సమస్యలను ఆయన దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు. వృధాగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. గ్రామంలో చెత్త సేకరణకు సిబ్బంది లేరని పంచాయతీలలో నిధులు కొరత ఉందని జడ్‌పిటిసి రాములు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వం నుండి నిధులు ఇప్పిస్తే చెత్త సేకరణకు సిబ్బందిని నియమిస్తామన్నారు. దానికి స్పందించిన కలెక్టర్ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అప్పటివరకు ప్రతి ఇంటికి ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి సిబ్బందిని నియమించుకోవాలని ఎంపిడిఓ సబిత, గ్రామ సర్పంచ్‌కు సూచించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని అన్నారు. గ్రామంలో ఏడు మందికి ఆసరా పింఛన్లు రావడం లేదని వయసు పెద్దదే అయినా మధ్యలో ఆపివేశారని కలెక్టర్‌కు వృద్ధులు వేడుకున్నారు. గ్రామంలో కాని మండలంలో కాని ఇలాంటివారు ఉంటే మరోసారి పరిశీలించి నివేదిక పంపాలని అధికారులను అదేశించారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ సబ్‌కలెక్టర్ సందెప్‌కుమార్ ఝా, ఎంపిపి ఉమాపార్వతి, జడ్‌పిటిసి రాములు, గ్రామ సర్పంచ్, డిఆర్‌డిఓ జాన్సన్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.