రంగారెడ్డి

జెపి దర్గా గంధోత్సవంలో తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జనవరి 20: ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన గంధోత్సవం ఊరేగింపులో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కిందపడిపోగా పక్కనే ఉన్న కొందరు పట్టుకున్నారు. ఈ సంఘటనలో కుడిచేయ వెనుక (వీపు) భాగం గాయాలు తగిలాయి. గంధోత్సవం ఊరేగింపులో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కానీ నిర్వాహకులు భక్తుల రద్దీని గమనించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే తోపులాట జరిగిందని భక్తులు ఆవేదన చెందారు. తోపులాటలో ఎమ్మెల్యేకు గాయాలు తగలడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలలో సిటి స్కానింగ్, ఎక్స్‌రే తీసి చికిత్స చేయించుకున్నారు. దర్గా ఉత్సవాలలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్టన్రుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
కారు బోల్తా: ఇద్దరి మృతి
నార్సింగి, జనవరి 20: వేగంగా దూసుకువచ్చిన కారు డివైడర్‌కు ఢీకొని పల్టీకొట్టి ఎదురుగా వస్తున బస్సును ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ విజయ్ కథనం ప్రకారం... నగర టోలిచౌకి హకీంపేట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ కుమారుడు మహ్మద్ ఉస్మా (18) విద్యార్థి. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాజ్ కుమారుడు షాబాజ్ (18) స్థానికంగా ఓ మెడికల్ హాల్‌లో వర్క్‌ర్. షరీఫ్ కుమారుడు మహ్మద్ ఇఫ్రాన్ (22) మెడికల్ హాల్ వర్కర్. ఉస్మా, షాబాజ్, ఇఫ్రాన్ ముగ్గురు మిత్రులు. ముగ్గురూ కలిసి శుక్రవారం ఉదయం 9:45కి గండిపేట్ నుంచి లంగర్‌హౌస్ వైపు(ఏపి28 డియు 9498) కారులోవస్తున్నారు. ఉస్మా కారు నడుపుతున్నాడు. కాగా వేగంగా దూసుకువచ్చి రాయల్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు డివైడర్‌కు ఢీకొని పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న షాబాజ్ సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, ఇఫ్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.