రంగారెడ్డి

అదుపు తప్పి లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జనవరి 21: అదుపుతప్పి లారీ బోల్తా పడటంతో ఐదుగురు తీవ్రంగా గాయపడటమే కాకుండా తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. చౌదరిగూడ ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామ శివారులో ముందువెళ్తున్న డిసిఎం వ్యాన్‌ను తప్పించబోయి లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడటంతో గోదుమరాసి అంజయ్య (35), జానంపేట అంజయ్య (25), జానంపేట ప్రకాష్ (26), గోదుమరాసి యాదయ్య (24) కాళ్లు విరిగిపోయినట్టు ఎస్‌ఐ వివరించారు. జానంపేట శేఖర్ (34), జానంపేట అంజనేయులు (22) అనే ఇద్దరు వ్యక్తులకు చేతులు విరిగాయి. జానంపేట నర్సింలు, రవి, మల్లేష్, అంజయ్య, నర్సింలు, గోపాల్, దశరథ్ స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా మండల పరిధిలోని రావిర్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని వీరసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. లాల్‌పహాడ్ వద్ద మొక్కజొన్న సంచులు లారీలో వేసుకొని మిగతా సంచుల కోసం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎనె్కపల్లి గ్రామానికి వెళ్తుండగా తుమ్మలపల్లి గ్రామ శివారులో లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న 14మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ యాదయ్య పరారయ్యాడని కూలీలు తెలిపారు. క్షతగాత్రులను 108 సహాయంతో షాద్‌నగర్ ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించిన ఐదుగురిని హైదారాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. చౌదరిగూడ ఎస్‌ఐ లింగం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాడు.
మిన్నంటిన బంధువుల రోదనలు
అదుపుతప్పి లారీ బోల్తాపడిన ఘటన వార్త ఒక్కసారిగా కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటిపోయాయి. హుటాహుటిన కొంతమంది కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మరికొంతమంది కుటుంబ సభ్యులు షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టారు. దీంతో ఆసుపత్రి ఆవరణ మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. అలాగే పలువురిని కంటతడి పెట్టించింది.

ఇద్దరు చిన్నారులతో
రైలుకింద పడి తల్లి ఆత్మహత్య
నేరేడ్‌మెట్, జనవరి 21: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు కొడుకులతో కలసి గృహిణి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మణికొండ ప్రాంతంలో నివసించే గౌరమ్మ గృహిణి. అమె ఇద్దరు కుమారులు నాగరాజు, సాయితేజ మణికొండలోని విశ్వభారతి పాఠశాలలో 1వ తరగతి, యుకెజి చదువుతున్నారు. గౌరమ్మ శనివారం ఉదయం తన ఇద్దరు కుమారులు నాగరాజు, సాయితేజలను తీసుకుని మల్కాజిగిరి నుండి లాలాగూడ వెళ్లే రైలుమార్గంలో కుమారులతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.