రంగారెడ్డి

కీసరగుట్ట జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 21: కీసరగుట్ట జాతరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 24న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్ ఎంవి రెడ్డి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించారు. ముందుగా టిటిడి వేద పాఠశాల వద్ద వివిఐపిల పార్కింగ్ గతంలో ఏర్పాటు చేసే వారమని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం కల్యాణ మంటపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజన అనంతరం మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను కోరారు. విఐపి దర్శనాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా, సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గుట్టపై రంగులు వేసి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. కీసరగుట్టకు వచ్చే భక్తులకు పవిత్ర స్థలానికి వచ్చిన అనుభూతిని కల్గించాలని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం గుట్టపై పూల చెట్లు పచ్చదనాన్ని పెంచాలని అధికారులను కోరారు. జాతర సమయంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, భక్తుల మన్ననలు పొందాలని సూచించారు. గతంలో నెలకొన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. జాతర సందర్భంగా నిర్వహించే క్రీడలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. రామలింగేశ్వరస్వామి సన్నిధిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పడి 100 రోజులు కావస్తున్నా, ఆలయ అభివృద్ధిపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని తెలీదా అంటూ ఆలయ ఇఓ వెంకటేశ్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలసత్వం వీడి ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించాలని అన్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిపిఓ సురేశ్‌మోహన్, డిఇఓ ఉషారాణి, మల్కాజ్‌గిరి డిసిపి రమేశ్‌నాయుడు, ఎసిపి రఫీక్, ఆలయ చైర్మన్ టి.వెంకటేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కులకచర్ల, జనవరి 21: కులకచర్ల మండల కేంద్రం నుంచి ఒక డిసిఎం వాహనం, ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండల రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కులకచర్ల మండల కేంద్రంలో ఒక డిసిఎం వాహనంలో సుమారు 115 బస్తాల బియ్యం, ఎపి 28 టి ఎస్ 0977 అను సంఖ్య గల ఆటోలో సుమారు 10 బస్తాల రేషన్ బియ్యం తరలిస్తుండగా రెవెన్యూ అధికారులకు అందిన సమాచారం మేరకు వాటిని ఆపి కార్యాలయానికి తరలించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. డిసిఎం వాహనంలో ఉన్న 115 బస్తాల బియ్యంలో కేవలం 10 బస్తాల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇవి కూడా రేషన్ బియ్యమా కాదా అనే విషయంలో వారు పౌరసరఫరాల శాఖకు చెందిన వారిని పిలిపించి పరీక్షలు నిర్వహించాక నిర్ధారిస్తామన్నారు. ఆటోలో ఉన్నటువంటి మాత్రం రేషన్ బియ్యమని నిర్దారించి వాటిని సీజ్ చేశారు. అనంతరం ఆటోను స్థానిక రక్షకభట నిలయానికి తరలించారు. సదరు డిసి ఎం వాహానం కుసుమసంద్రం గ్రామానికి చెందినది అధికారులు తెలిపారు.
కులకచర్లలో శనవారం పట్టుబడ్డ బియ్యం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబానికి సంబంధించిన వారివిగా చెబుతున్నారు. మండలంలో కీలకమైన పదవిలో ఉన్న వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసిన భాజపా కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులు నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డ వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో పక్క జిల్లాలో పట్టుబడగా అధికారాన్ని వినియోగించుకుని తప్పించుకున్నట్లు తెలిసింది. ఉదయం వేళల్లో బహిరంగంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుబడడంతో మండలం అంతా చర్చనీయాంశంగా మారింది. రేపటికల్లా బియ్యాన్ని మార్చేసి రేషన్ బియ్యం కావని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు వ్యాఖ్యానించారు.