రంగారెడ్డి

తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 22: తెలుగు వారి శక్తి సామర్థ్యాలు దేశాభివృద్ధికి దోహదపడాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగర శివారు ప్రాంతంలోని కొంపల్లి, సినీ ప్లానెట్ సమీపంలోని సిద్ధ్ కనె్వన్షన్ హాల్‌లో తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగు ప్రజలు అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారని, తెలుగుప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన అనంతరం తెలుగువారిలో ఐక్యత లేదనే భావం ఏర్పడుతుందని, తెలుగు సంగమం ద్వారా తెలుగువారంతా ఒక్కటేనని చాటడం సంతోషకరమని అన్నారు. తెలుగువారి శక్తి సామర్థ్యాలు దేశాభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీహీరో సునీల్ హాజరై తన సంక్రాంతి అనుభవాన్ని వ్యక్తం చేశాడు. సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో ఆదివారం ఉదయం నుండి కనె్వన్షన్ హాల్ అంతా సందడిగా మారింది. చిన్నారుల నృత్యాలు, సంప్రదాయ దుస్తులతో పలువురు ఆకర్షణీయంగా నిలిచారు. కార్యక్రమంలో పిండి వంటకాలను అతిథులకు అందించారు. కార్యక్రమంలో తెలుగు సంగమం అధ్యక్షుడు మురళీధర్ రావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బిజెపి నాయకులు ఇంద్రసేనారెడ్డి, పుష్పగిరి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా
గాజులరామారం శ్రీ చిత్తారమ్మ దేవి జాతర

జీడిమెట్ల, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో శ్రీ చిత్తారమ్మ దేవి జాతర వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్త జనసందోహంతో దేవాలయం కిటకిటలాడింది. వివిధ జిల్లాలు, ప్రాంతాల నుండి భక్తులు వేలాదిసంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. సుమారు కిలోమీటరు మేర పొడవునా గాజులరామారం ప్రధాన రోడ్డు భక్తులకు కిటకిటలాడింది. రోడ్డంతా భక్తులతో సందడిగా మారింది. అమ్మవారికి మేకపోతులు, కోడిపుంజులు, తొట్టెల ఊరేగింపుతో భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు.
బోనాలను నెత్తిన పెట్టుకుని శివసత్తులు నృత్యాలు చేసుకుంటూ మొక్కలను సమర్పించుకున్నారు. ప్రతిఏటా వైభవంగా జరిగే ఈ జాతరకు వేలాదిసంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలు చేసి మొక్కులను తీర్చుకుంటారు. కోరుకున్న భక్తునికి కొంగుబంగారమై చిత్తారమ్మ దేవి విలసిల్లుతోంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గాజులరామారం చిత్తారమ్మ దేవాలయానికి పోటెత్తారు. ఈ జాతర ఉత్సవాలకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎమ్మెల్సీ రాజు, గ్రేటర్ హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కార్పొరేటర్‌లు రావుల శేషగిరి, సత్యనారాయణ, జగన్, ఆలయ చైర్మన్ కూన అంతయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు తెరాస నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, వివేక్ మాట్లాడుతూ చిత్తారమ్మ దేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రతిఒక్కరినీ అమ్మవారు చల్లగా చూడాలని వేడుకున్నామన్నారు.