రంగారెడ్డి

విద్యార్థి ప్రాణం తీసిన సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 22: సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా గండేడు మండలం జిన్నారం గ్రామానికి చెందిన నిఖిల్‌రెడ్డి(14) వికారాబాద్ పట్టణంలోని బంధువుల ఇంట్లో ఉంటూ భృంగీ ఇంటర్నేషనల్ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి డాక్టర్ ఆనంద్‌కు చెందిన కారులో తనయుడు శ్యామ్, మరో విద్యార్థితో పాటు నిఖిల్‌రెడ్డి పరిగి వైపు బయలుదేరారు. పోలీసు శిక్షణ కేంద్రం వద్ద అదుపుతప్పిన కారు బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందగా, శ్యామ్ మరో విద్యార్థి ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుండి బయటపడ్డారు. మృతుని బంధువు బుచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భూగర్భ జలాలు
అడుగంటుతున్నాయ్

ఉప్పల్, జనవరి 22: పీర్జాదిగూడ పురపాలక సంఘం సమీక్షా సమావేశం ఆదివారం బండి గార్డెన్‌లో జరిగింది. ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక సంఘం కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, డిప్యూటి ఇంజనీర్ సత్యనారాయణ, ఎఇ శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుకృతారెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి రాంరెడ్డి, తహశీల్దార్ సంతోష్‌లాల్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, జల మండలి డిఇ, మేనేజర్, విద్యుత్ ఎఇ పాల్గొని పురపాలక సంఘంలోని పర్వతాపూర్, మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యల ఫిర్యాదులను స్వీకరించారు. సుమారు 150 కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శిలు పాల్గొని ఆయా ప్రాంతాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలపై ఏకరువుపెట్టుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, దినం విడిచి దినం కృష్ణా తాగునీటిని సరఫరా అయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకోవాలి
బాలాపూర్, జనవరి 22: ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొవాలని మీర్‌పేట్ కమిషనర్ డి.జగన్ పేర్కొన్నారు. ఆదివారం మీర్‌పేట్ లెనిన్‌నగర్ కాలనీని కమిషనర్ జగన్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాలనీవాసులు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న సమస్యలను అంచెలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో నిర్మాణం చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని, ప్రభుత్వం లక్షల నిధులు కేటాయించి నిర్మాణం చేసినా వాటిని ఉపయోగించకపోవడం ఎంతవరకు సబబు అని కాలనీ వాసులను ప్రశ్నించారు. ప్రభుత్వం మీ అవసరాల కోసం లక్షల రూపాయల నిధులు వినియోగించి ఏర్పాటు చేసిన వసతులను సద్వినియోగం చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మాణం చేయనున్న మరుగుదొడ్లను కాలనీ వాసులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సక్రమంగా నిర్వహణ చేసుకోవాలని తెలిపారు. ఇక్కడ నిర్మాణం చేస్తున్న మరుగుదొడ్లు సరిపోకపోతే మరి కొన్ని నిర్మాణం చేస్తామని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం అనంతరం ఎవరైన బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేస్తేకఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంచినీటి సమస్య లెనిన్‌నగర్ కాలనీకి మాత్రమే లేదని మొత్తం మీర్‌పేట్ నగర పంచాయతీలో ఉందన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఇ ఆర్.రామోహన్‌రావు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ మహేందర్, సిబ్బంది బొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.