రంగారెడ్డి

‘గుట్ట’ గురుకులంలో గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయ నగరాన్ని చలి కమ్ముకుంటోంది. మెత్తని పరుపు మీద రగ్గు కప్పుకొని పడుకున్నా ఇంకా చలిగానే ఉంటోంది. శివార్లలో అయతే రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా త క్కువే. అయనా ఆ గురుకుల విద్యార్థులు కటిక నేల మీదే పడుకుంటున్నారు. మంచాలు లేవు.. చుట్టూ పందుల సంచారం.
ఈ గురుకులం ఎక్కడో లేదు. మేడ్చల్ కలెక్టరేట్‌కు సమీపంలో వుంది. అయనా విద్యార్థుల కన్నీటి వ్యథ అధికారులకు పట్టడంలేదు.

కీసర, జనవరి 22: గరుకుల పాఠశాలల్లో ఇకమీదట విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. సన్నబియ్యం, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం.. గురుకులాల నిర్వహణకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాం.. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం.. అనే మాటలు కేవలం ఆదేశాలకే పరిమిత మయ్యాయి. జిల్లా కలెక్టరేట్ ప్రక్కనే ఉన్న కీసరగుట్ట గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు తాగటానికి పరిశుభ్రమైన నీరు కూడా లేదు. మెస్ చుట్టూ ఉన్న అపరిశుభ్రమైన వాతావరణం, పందుల స్వైర విహారంతో తినలేని పరిస్ధితి. ఇక రాత్రి అయితే దోమల బెడద, చర్మాన్ని తొలిచేంత చలి, పడుకోవటానికి మంచాలు లేవు, కప్పుకోవటానికి దుప్పట్లు లేవు, స్నానం చేయాలన్నా, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా, ఒకే ఒక్క బోరు మాత్రమే దిక్కు. దోమలు అధికంగా ఉండటంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఎన్నో సమస్యల మధ్య గురుకులంలో విద్యార్థులు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రభుత్వ పరంగా తమకు ఎలాంటి నిధులు రాకపోవడం వల్లనే తాము ఎలాంటి వసతులు కల్పించ లేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. గత నెలలో జరిగిన సిఎం కలెక్టర్ల సమావేశంలో గురుకులాల్లో అధికారులు నిద్రించాలని ఆదేశాలు జారీ చేసినా, ఇంత వరకు నిద్ర కాదు కదా, గురుకులాల వైపు కనె్నత్తి చూసిన దాఖలాలు లేవనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్ధం కావటం లేదని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నవవధువు ఆత్మహత్య
కెపిహెచ్‌బి కాలనీ, జనవరి 22: భర్త వేధింపులు తాళలేక ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన చింతల విజయలక్ష్మి (24), నల్గొండ నకిరేకల్‌కు చెందిన కడమంచి గిరిబాబుతో గత సంవత్సరం నవంబర్ నెలలో వివాహం జరిగింది. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి అయిన గిరిబాబు తన భార్యతో కలిసి కెపిహెచ్‌బికాలనీ రెండవ ఫేజ్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం బయటికి వెళ్లిన గిరిబాబు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య తలుపులు తీయకపోవడంతో పొరుగువారి సహకారంతో ఇంటితలుపు తెరిచి చూసేసరికి తన భార్య బెడ్ రూమ్‌లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని, వేధింపుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సిఐ కుషాల్కర్ తెలిపారు. పెళ్లి సమయంలో 15 లక్షల కట్నం ఇచ్చానని, ఇంకా 15 లక్షలు ఇవ్వాలని తన కూతురిని తరుచూ వేధిస్తున్నాడని, చివరికి తన కూతురిని హత్య చేసి, ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం తన అల్లుడు చేస్తున్నాడని, ఇంత దారుణానికి పాల్పడిన గిరిబాబుని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.