రంగారెడ్డి

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, జనవరి 23: ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం నందిగామ కేంద్రంలోని తపా ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గత పదిహేను రోజుల నుండి పరిశ్రమ మూతబడి ఉంది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పరిశ్రమ గోదాము నుంచి మంటలు వ్యాపించాయి.
షాద్‌నగర్ ఫైరింజన్‌కు సమాచారం తెలపడంతో ఫైరింజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అపడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ మంటలు రాత్రి ఏడు గంటల వరకు కూడా అదుపులోకి రాలేవు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే మరే కారణాలతో జరిగిందా అనే విషయాలు తెలియరాలేదు.
మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ పరికరాలు ఎంతవరకు మంటల్లో అంటుకొని నష్టం జరిగింది అనే వివరాలు పరిశ్రమ యజమానులు అంచనా వేస్తున్నారు. కొత్తూరు రూరల్ సిఐ మధుసూదన్, ఎస్సై శ్రీశైలం యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని కారణాలను పరిశీలిస్తున్నారు.
‘క్రషింగ్’ పేలుళ్లతో ఇళ్లకు బీటలు

పేలుళ్లతో దద్దరిల్లుతున్న గ్రామాలు
కొందుర్గు, జనవరి 23: ఇళ్లు బీటలు బారుతున్నాయి.. ఇళ్లల్లో జనం ఉండాలంటేనే వణుకుతున్నారు.. ఇదంతా క్రషింగ్ పేలుళ్ల మహిమే.. నేడు కొందుర్గు మండలంలోని పలు గ్రామాలలో ఈ పరిస్థితి నెలకొంది. పలు గ్రామాలలో కంకర కోసం రాళ్ల గుట్టలను బ్లాస్టింగ్లతో పేల్చి వేస్తుండడంతో సమస్యల పర్వం మొదలవుతోంది. ఒక సమయం అంటూ లేకుండా ఇష్టారీతిన ప్రభుత్వ అనుమతులేంటి..? అక్కడ జరుగుతున్నదేంటి..? ప్రజలు ఏవిధంగా ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాలపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ, భూగర్భ జలాల అధికారులు వౌనం వహిస్తున్నారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తుండడంతో పలు గ్రామాలలో ఇళ్లు బీటలు బారిపోతున్నాయి. దీంతో ఇళ్లు ఎప్పుడు కూలతాయోనన్న ఆందోళన సైతం గ్రామీణ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం కొందుర్గు మండలంలోని గంగన్నగూడెం, మహదేవ్‌పూర్, చౌదరిగూడ మండలంలోని ముష్టిపల్లి, తూంపల్లి పరిసర గ్రామాలలో ఉన్న రాళ్ల గుట్టలను బ్లాస్టింగ్‌ల ద్వారా పేల్చి వేస్తున్నారు. దీంతో రాళ్లు సమీప ప్రాంత గ్రామాలలోకి పడుతుండడం, బ్లాస్టింగ్‌లకు ఇళ్ల గోడలు బీటలు బారుతున్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో బ్లాస్టింగ్ చేస్తున్నారని, అనుమతి ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, అందువల్ల పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం అధికారపక్ష నేతలు, విపక్ష పార్టీ నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికార యంత్రాంగం నేటికి స్పందించని పరిస్థితులు నెలకొన్నాయి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
తమ గ్రామాల వద్ద నిర్వహిస్తున్న బ్లాస్టింగ్‌ల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని తమను కాపాడాలంటూ కొందుర్గు మండలం గంగన్నగూడెం, మహదేవ్‌పూర్, చౌదరిగూడ మండలం ముష్టిపల్లి, తూంపల్లి గ్రామాల ప్రజలు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ కమీషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్‌ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, గోడలు బీటలు బారుతున్నాయని గ్రామాల ప్రజలు సద్దాం హుస్సేన్, రాములు, రామయ్య, నర్సింలు, చిన్నయ్య, అంజమ్మలతోపాటు అనేక మంది ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు పంపించారు.
నిబంధనలు బేఖాతర్
బ్లాసింగ్‌లు నిర్వహించే సమయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను సైతం బేఖాతర్ చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఒక వద్ద అనుమతి తీసుకుని చుట్టుపక్కల సైతం అనధికారికంగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పేలుళ్ల సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని అటు అధికార పార్టీ నేతలు, ఇటు విపక్ష నేతలు అధికారులకు విన్నవించినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. నేడు తమకు న్యాయం చేయాలంటూ వివిధ గ్రామాల ప్రజలు చేసిన ఫిర్యాదులకు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
దర్యాప్తు చేస్తాం
పలు గ్రామాలలో పేలుళ్ల కారణంగా సమస్యలు తలెత్తుతున్న విషయంపై, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న విషయంపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదులు వస్తే దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ఆర్‌డిఓ కృష్ణ తెలిపారు.