రంగారెడ్డి

ఆర్భాటం కోసమే ఓయూ శతాబ్ది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జనవరి 24: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాననడం కేవలం ఆర్భాటం కోసమేనని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఓయూ ఉత్సవాలకు ముందు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తొలివిడత, మలివిడత తెలంగాణ ఉద్యమం ఓయు నుంచే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తన వల్లే వచ్చిందని కేసిఆర్ అనడంలో వాస్తవం లేదన్నారు. ఎన్నో ఆందోళనలు, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులతో తెలంగాణ వచ్చిందన్నారు. కేసిఆర్ ముందుగా మెప్పు కోసం ఆర్భాటంగా ప్రకటనలు చేసి ప్రజలను మభ్యమెడుతున్నారని, తీరా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. ఓయు భూములు అన్యాక్రాంతానికి గురైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ దీనావస్థలో ఉందన్నారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ హయాంలో జిల్లాకు ఒకటి చొప్పున యూనివర్సిటీని మంజురు చేశారని, ఆ యూనివర్సిటీల్లో 2554 పోస్టులు ఉండాల్సి ఉండగా కేవలం 1500 పోస్టులతో యూనివర్సిటీలు కొనసాగుతున్నాయని అన్నారు. సరైన వౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూజిసి, న్యాక్ ద్వారా నిధులు రావడం లేదని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్ చార్జీలలో కోతవిధించి మెస్ చార్జీలను పెండింగ్‌లో ఉంచారని అన్నారు. విద్యార్థులతో కేసిఆర్ చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కెజి టు పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి సాధనలో మాత్రం విఫలమయ్యారని పేర్కొన్నారు. ఉన్న పాఠశాలలు మూతపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఉంటికి ఉద్యోగం ఇస్తానన్న మాటలు ప్రస్తుతం లేవని ప్రశ్నించారు. డిఎస్‌సి ను నిర్వహించి ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి దానిని పరిగణలోకి తీసుకోవడంలో సిఎం విఫలమయ్యారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మైనారిటీలకు ఇంగ్లీషు మీడియంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలన్నారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్‌మస్ తదితర పండుగలను ప్రభుత్వం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంప్రదాయ బద్ధంగా ఆనాటి నుండి పండుగలు ప్రజలే ఆర్భాటంగా చేసుకుంటారని చెప్పారు. దీనిద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలను, విద్యార్థులను పక్కదోవ పట్టించే విధంగా చేయడం సరైంది కాదన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు నందారం ప్రశాంత్, మహ్మద్ యూసుఫ్, నందారం రాజేందర్, సోమశేఖర్, సంజీవ్‌రెడ్డి, భవనప్ప, గౌరారం నర్సింహారెడ్డి, రాజేష్‌రెడ్డి ఉన్నారు.

ప్రభుత్వ ప్రచారం కోసమే శాసనసభ అజెండా
వికారాబాద్, జనవరి 24: రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచారం కోసమే అజెండాను తయరు చేసుకుని శాసనసభను ఉపయోగించుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలను పక్కనబెట్టి, తక్కువ ప్రాధాన్యత ఉన్న అంశాలకు ఎక్కువ సమయాన్ని ఇచ్చారని చెప్పారు. బడ్జెట్ సమావేశాలో అలా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో జేబులు నింపుకుంటున్నారే తప్ప నీళ్లు తీసుకురావడానికి కాదని ఆరోపించారు. మిషన్ భగీరథ కాదది కమీషన్ భగీరథగా మారిందని, ఆంధ్రోళ్లు దోచుకున్నారన్న కేసిఆర్ ఇపుడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి రెట్టింపు అంచనాలతో నిధులు మంజూరు చేయించి పంచుకుంటున్నారని, ప్రభుత్వం అవినీతి టెండర్ల ప్రక్రియను శాసనసభ స్పీకర్‌కు అందించామని, నిరూపణకు సిద్ధమని శాసనసభలో వెల్లడించామని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో కేసిఆర్ పాలనలో వ్యవసాయం పాడైందని, గ్లామర్, పబ్లిసిటీగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మోదీ పెట్టుబడికి అదనంగా 50శాతం కలిపి పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించి అది మరచిపోవడమే కాకుండా స్వామినాథన్ కమిటీని పక్కనబెట్టి కొనుగోళ్లే చేయడం లేదని వాపోయారు. భారతదేశంలో అత్యధికంగా వరి తెలంగాణలోనే పండిస్తారని, 75శాతం నుంచి 80 శాతం గతంలో కేంద్రమే కొనుగోలు చేసేదని, ప్రస్తుతం వరితో పాటు ఇతర పంటల్లో ఎంఎస్‌పి నిర్ధారించకపోవడంతో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇప్పటి వరకు 3500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్పీకర్‌కు జాబితా పంపి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని చెప్పినా స్పందన కరవైందని వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న క్వింటాలు కందుల ధరను రూ.5050 నుంచి రూ.7000కు పెంచాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయని స్పష్టం చేశారు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు మరో వైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2013-14లో 107 లక్షల టన్నుల ఉత్పత్తులు 2014-15లో 75, 2015-16లో 49 లక్షల టన్నులకు పడిపోయాయని తెలిపారు. బంగారు తెలంగాణ అంటూ భ్రష్టు తెలంగాణ చేస్తున్నారని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలను మోదీ, ఇంటికో ఉద్యోగం అని కేసిఆర్ ఇస్తామని ఇవ్వలేదని అన్నారు. యువత నైరాశ్యంలో ఉందని పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.