రంగారెడ్డి

టి-హబ్ రెండోదశ నిర్మాణంలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టి-హబ్ రెండో దశ పనులలో విషాధం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలీ బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చేందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టి-హబ్‌ను రాయదుర్గం సర్వే నెంబర్ 83లో నిర్మాణం చేయిస్తుంది. టి-హబ్‌ను నిర్మించేందుకు కెసిపి ప్రొజెక్ట్సు నిర్మాణ సంస్థకు పనులను అప్పగించింది. పనులు కూడా ఈమధ్య ప్రారంభం కావడంతో మట్టిపనులు, సెల్లార్‌లో కాంక్రీట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి క్రేన్‌పై స్టీల్ తరలిస్తుండగా క్రేన్‌కు సంబంధించిన సీలింగ్ వైర్ తెగిపోవడంతో ఐరన్ రాడ్లు నిర్మాణంలో ఉన్న గోడకు తగిలి కూలిపోయింది. ఆ సమయంలో సైట్‌లో పని చేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్‌కుమార్ యాదవ్ (40) జియాహుల్ అన్సారీ(22)పై గోడ పడింది. దీంతో ఇరువురికి తీవ్రగాయలయ్యాయ.
నిర్మాణ సంస్థకు చెందిన అధికారులు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. పరీక్షించి వైద్యులు అన్సారీ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రగాయాలైన మరో వ్యక్తి దిలీప్ కుమార్ యాదవ్ చికిత్స అందిస్తుండగా తెల్లవారుఝాము రెండు గంటలకు మృతిచెందాడని సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్ డ్రైవర్ దారుణ హత్య
జీడిమెట్ల, జనవరి 24: ఆటోలో వెళ్తుండగా కాలు తగిలిందని గొడవ పడి మద్యం మత్తులో ఓ టిప్పర్ డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను దుందిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లో బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, ఏసిపి శ్రీనివాస్ రావు, దుందిగల్ సిఐ శంకరయ్య ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లఢించారు. అదిలాబాద్ జిల్లా సోన్‌పల్లికి చెందిన అశోక్‌కుమార్ అలియాస్ సోంకబ్లి(37) టిప్పర్ లారీ డ్రైవర్. గండిమైసమ్మ దుందిగల్ మండలం మల్లంపేట్ గ్రామంలో గంగాధర్‌తో కలిసి నివసించాడు. ఈనెల 6న డ్రైవింగ్ పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు అశోక్‌కుమార్ స్నేహితుడు గంగాధర్‌తో కలిసి సిద్ధమయ్యాడు. స్నేహితుడు గంగాధర్‌తో మద్యం సేవించడానికి ఆటోలో గండిమైసమ్మకు వెళ్తున్నారు. దొమ్మరపోచంపల్లి గ్రామం చంద్రశేఖర్ బస్తీలో నివాసముండే సయ్యద్ ఖలీమ్(24), షేక్ ఉమర్ పాషా(24), సయ్యద్ రబ్బాని(20) టాటా ఏస్ డ్రైవర్లు. అశోక్‌కుమార్, గంగాధర్ వెళ్తున్న ఆటోలో ఉన్న ఖలీమ్, ఉమర్ పాషా, రబ్బాని ఉన్నారు. అశోక్‌కుమార్ కాలు తగిలిందని ముగ్గురితో చిన్నగొడవ జరిగింది. విషయాన్ని తేలికగా తీసుకున్న అశోక్‌కుమార్ మృత్యువు పొంచి ఉందని ఆలోచించ లేకపోయాడు. ఖలీమ్, ఉమర్ పాషా.. ఇంటికి వెళ్లి రబ్బానితో కలిసి టాటా ఎస్ వాహనంలో మళ్లీ అశోక్‌కుమార్, గంగాధర్ ఉన్న దగ్గరికి వచ్చి ఇద్దరిని తీసుకుని గండిమైసమ్మలోని స్టేడియం వద్దకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఖలీమ్, ఉమర్ పాషా, రబ్బానితో కలిసి ఇనుపరాడ్లతో అశోక్‌కుమార్‌ను చితకబాది, గ్రానెట్ రాయితో మోది హత్య చేశారు. అంతటితో ఆగక మృతుని రూమ్‌లో ఉన్న బట్టలు, టీవి ఎత్తుకెళ్లి నిందితుల ఇంట్లోనే దాచారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం షాపులోని సిసి కెమెరా ఫుటేజీ ఆధారంతో ముగ్గురు నిందితులైన ఖలీమ్, పాషా, రబ్బానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుండి టివి, బట్టలను స్వాధీనం చేసుకున్నారు.