రంగారెడ్డి

ఉద్యమకారులకు ఉద్యోగాలు ఎన్నడో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అవిరాళంగా కృషి చేసిన ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా, తాండూరు డివిజన్ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో గళమెత్తిన కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. గత 2010 నుండి తెలంగాణ సాధించే వరకు ఉద్యమపోరాటాలలో పాల్గొన్న యువకులు, కళాకారులందరికీ 2015లో ఉద్యోగాలు కల్పించి, వారిపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తి వేస్తామంటూ నాటి ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయంటూ జిల్లాతోపాటు, తాండూరు డివిజన్‌లో ఉద్యమ పోరాటాలు సాగించిన యువ నాయకులు జి.కేశవులు, శంకర్, అనుపమ్ సునీల్, నర్సింలు ఫకీరప్ప, సలీం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొసం పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని పోరాటాలు చేస్తూ పోలీస్ కేసులు, రైల్వే కేసులలో ఇరుక్కొని నరకయాతన పడుతున్న నిరుద్యోగ యువతకు టిఆర్‌ఎస్ పాలకులు, సిఎం కేసిఆర్ ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ పార్టీ ఏమ్మెల్యేలు సముచిత న్యాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్ళ కాలం పూర్తయిందన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన ప్రారంభించి రెండున్నర ఏళ్లు పూర్తయినా నాటి ఉద్యమ కారులకు తగిన న్యాయం చేకూర్చటంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ వాపోయారు. తెలంగాణ ఉద్యమ సాధన కాలంలో ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా సకల ప్రయత్నాలు చేసిన ఉద్యమద్రోహులు నేడు మంత్రి పదవుల్లో కూర్చున్నారని వారు మండిపడ్డారు. ఉద్యమ పోరాటాల వేళ తెలంగాణ, యువత, విద్యార్థిలోకం పోరాటాల పటిమ వ్యర్థం కానివ్వం, వారి ఇళ్లవద్దకు వెళ్ళి ఉద్యోగ పత్రాలు అందిస్తాం, ఉద్యమంలో అమరులయిన వీరుల కుటుంబాలను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాం అన్న కేసిఆర్ చేసిన బాసలు, హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. తాము ఆత్మబలి దానాలకు తెగించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడితే, ఈనాడు తెల్లదొరల మాదిరి తెలంగాణను దోచుకుంటున్న వారికి సిఎం కేసిఆర్, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవులు ఇచ్చి నాటి తెలంగాణ ద్రోహులు, సీమాంధ్ర పార్టీల నుండి వలస వచ్చిన నాయకులను భుజాన మోస్తున్నారని అన్నారు. ఇకనైనా తెలంగాణ ఉద్యమ పోరాట వాదులను, యువతను గుర్తించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఆటో బోల్తా
శంషాబాద్, జనవరి 29: ఆటో బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని బహదూర్‌పూరకు చెదిన షేక్ మహ్మద్‌పాషా, ఫరీదాబేగం కుటుంబానికి చెందిన 10 మంది కొత్తూర్ మండలంలోని జెపీ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాకొటింది. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైయ్యాయిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన స్వామిగౌడ్
పెద్దషాపూర్ గ్రామం వద్ద ఆటో బోల్తాపడిన ప్రమాదాన్ని అటుగా వస్తున్న శాశన మండలి చైర్మన్ స్వామిగౌడ్ చూసి వెంటనే కాన్వాయ్‌ని ఆపి గాయాలైన వారిని చికిత్స కోసం శంషాబాద్‌లోని ఆసుపత్రికి తన కాన్వ్‌య్‌లో తీసుకువచ్చి చేర్పించారు.
మంటలు చెలరేగి కారు దగ్ధం
కీసర, జనవరి 29: కీసరలోని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డులో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. సిఐ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సత్తిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కారులో కీసరలోని వ్యవసాయ పొలానికి బయలు దేరాడు. కీసర జంక్షన్ వద్ద సర్వీసు రోడ్డుకు రాగానే కారులోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. గమనించిన సత్తిరెడ్డి కారును ఆపి కారులో ఉన్న వారందరినీ క్రిందకు దింపాడు. వెంటనే చర్లపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకొని మంటలను ఆర్పివేసారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ మేరకు కీసర పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.