రంగారెడ్డి

యువకుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జనవరి 30: భర్త విడాకులు ఇవ్వలేదని భార్య చెల్లలు మరో ఐదుగురు కలసి పథకం ప్రకారం భర్త తమ్ముడిని కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. పరిగి ఎస్‌ఐ హన్మంత్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ గ్రామానికి చెందిన మమ్మద్ ఖలీల్‌కు, కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన హసిమాకు 12 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. రెండు సంవత్సరాలు కాపురం చేసి విడిపోయారు. అప్పట్లో కోడంగల్ పోలీస్ స్టేషన్‌లో హసిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఖలీల్ విడాకులు ఇవ్వలేదు. అది మనుసులో పెట్టుకుని హసిమా, హసిమా చెల్లెలు నసీమా కలసి మహమ్మద్ ఖలీల్ తమ్ముడు ఖదీర్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. ఖాధీర్ అక్కకొడుకు తల వెంట్రుకలు తీయుటక తమ బంధువులు పరిగి మండలం చిగురాల్ పల్లి గ్రామానికి ఖాధీర్ వచ్చాడు. చిగురాల్‌పల్లి గ్రామానికి వస్తున్నట్లు నసీమాకు ఫోన్‌లో చెప్పాడు. చిగురాల్‌పల్లినుంచి బైక్‌పై బయలుదేరి ఖాదీర్ వెళ్తుండగా పరిగి బస్టాండ్ దగ్గర నసీమా కలసి బైక్‌పై వెళ్లింది. పరిగి మండలం హనమాన్ గండి సమీపంలోకి రాగానే వెనుక నుంచి క్వాలీస్ వాహనంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి ఖదీర్‌ను కొట్టి తమతో తీసుకెళ్లారు. కోడంగల్ మండలం మాటూరు గ్రామశివారులోని వ్యవసాయ పొలంలోని పాడుబడుపడిన ఇంటిలో నిర్బందించారు. 24వ తేదిన అక్కడి నుంచి ఇండికా కారులో తీసుకెళ్లి తాండూరు సన్‌రైస్ రిసార్ట్‌లో ఓ గదిని తీసుకుని అందులో ఉంచారు. 25వ తేది రోజు నసీమాను తీసుకువచ్చి ఖధీర్‌తో ఫొటోలు తీసారు. ఆధార్‌కార్డు లాక్కున్నారు. అక్కడి నుంచి కర్నాటక తీసుకెళ్లి తిప్పారు. అక్కడి నుంచి దౌల్తాబాద్ మండల శివారులో అర్ధరాత్రి వదిలి పెట్టారు. అక్కడి నుంచి ఖదీర్ పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకని జరిగిన విషయాలు చెప్పాడు. ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామని, ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరిలించామని, అక్కాచెల్లెలు మరో యువకుడు పరారీలో ఉన్నాడని పరిగి ఎస్‌ఐ హనుమంతు తెలిపారు.

మరమ్మతుల పేరిట ఖాళీ చేయించటానికి కుట్ర
ముషీరాబాద్, జనవరి 30: శిల్పారామం నైట్‌బజార్‌లో గత మూడేళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న తమని మరమ్మతుల సాకుతో షాపులను ఖాళీ చేయించటానికి స్పెషల్ ఆఫీసర్, జిఎం వేధింపులకు గురిచేస్తున్నారని శిల్పారామం నైట్‌బజార్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. సాక్షాత్తు హైకోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా రెండు నెలలుగా నైట్ బజార్ గేట్లను మూసివేసి, మంచినీరు, విద్యుత్, కూర్చునే బల్లలు తొలగించి తమని మానసికంగా, ఆర్ధికంగా వేదిస్తున్నారని తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా జాకబ్‌రాజ్, ప్రతినిధులు అల్త్ఫాబేగ్, చిన్న, సోయబీన్, సౌరబ్‌శర్మ, దీపక్‌శర్మ మాట్లాడుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. తొలుత 2015 మార్చిలో తమను ఖాళీ చేయాలని నోటీసులు వస్తే హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. మళ్లీ తప్పుడు సమాచారం జోడించి ఇచ్చి గత నెల డిసెంబర్‌లో నోటీసులు పంపించగా మళ్లీ తాము కోర్టును ఆశ్రయిస్తే శిల్పారామం అధికారులను సంజాయిషీ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆధికారులు ఇచ్చిన హామీ మేరకు తాము న్యాయంగా వ్యాపారాలు కొనసాగిస్తుంటే ప్రస్తుత అధికారులు కేవలం మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన నైట్ బజార్‌ను మరమ్మతుల పేరిట షాపులను మూసివేయించటానికి కుట్ర పన్నటం తగదన్నారు. సంబందిత శాఖ ఉన్నతాదికారులు స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.