రంగారెడ్డి

ప్రైవేటు యూనివర్సిటీలకు వ్యతిరేకంగా బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, ఫిబ్రవరి 6: ప్రైవేటు యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని క్యాబ్‌నెట్ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బస్సుయాత్రను ప్రారంభించారు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రొఫెస్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 22వ తేదీ వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల మానిఫేస్టోలో కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు చక్రధర్‌రావు, లక్ష్మినారాయణ, పద్మజషా, కెవై రత్నం పాల్గొన్నారు.
ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలి

ప్రొఫెసర్ హరగోపాల్
షాద్‌నగర్, ఫిబ్రవరి 6: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం హైదారాబాద్ నుండి విద్యాపోరాట యాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రిలయన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమి కావాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, దీన్ని ప్రభుత్వం వెంటనే తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అదే తరహాలోనే కొనసాగించాలి. నూతన విద్యాసంస్థలకు అమనుమతులు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే సమాన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో యంత్రికమైన విద్యను నేర్పిస్తున్నారని, దాని వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. సమాజం పట్ల అవగాహన, జీవనోపాధి కల్పించే విద్యను నేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యావ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాలని సూచించారు.
మతపరమైన విద్యను ప్రభుత్వం ప్రోత్సహించరాదని అన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలకు ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఫోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాల్సిన యూనివర్సీటిలను ప్రైవేట్ శక్తులు ఏర్పాటు చేస్తే దేశానికి ఎలాంటి మేలు చేకురదని అన్నారు. రిలయన్స్ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహా చేస్తున్నారని దీన్ని అడ్డుకునేందుకే తెలంగాణ రాష్ట్రంలోని 31జిల్లాలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో విద్యా పోరాట యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేది నుండి 20వ తేది వరకు యాత్ర కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటి ఉపాధ్యక్షులు నర్సింహ్మరెడ్డి, టిఆర్‌ఇఏఐటిఏ అధ్యక్షుడు రవిచంద్ర, టిపిటిఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, డిటిఎఫ్ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, పిడిఎస్‌యు ప్రధాన కార్యదర్శి ప్రదీప్, టివివి ప్రధాన కార్యదర్శి మద్దిలెటి, టిజి శ్రీనివాస్, పస్క నర్సయ్య, వరదయ్య, గణేష్, అరుణాంక్, నర్సింగ్‌రావు, బండారి నర్సప్స, రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.