రంగారెడ్డి

కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 7: కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మాత్సవాలు కనుల పండువగా నిర్వహించాలని కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులను కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఆలయ ఇఓ వెంకటేశ్ అధ్యక్షతన రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శివాలయం కీసరగుట్టని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుండి 27వరకు నిర్వహించే జాతరకు అధికారులంతా సిద్ధంకావాలని కోరారు. గతంలో ఉత్పన్నమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సామాన్య భక్తుడు త్వరగా స్వామివారి దర్శనం చేసుకునేలా ఉండాలని తెలిపారు. విఐపి పాసులు రెండువేలు మాత్రమే ముద్రించాలని కలెక్టర్ తెలిపారు. కీసరగుట్ట ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాల పోస్టర్‌ల ద్వారా రాష్ట్రం మొత్తం ప్రచారం నిర్వహించాలని కోరారు. గతంలో పనిచేసిన అధికారుల సలహాలు, సూచలను తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను కోరారు. ఉచిత దర్శనంలో నిలుచున్న భక్తులకు ఎండ లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాలుగు జనరేటర్‌లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇరవైనాల్గు గంటలు శానిటేషన్ పర్యవేక్షించాలని డిపిఓ సురేశ్‌మోహన్‌ను కోరారు. పెద్దమ్మ, నూర్‌మహ్మద్, తామరకొలను వద్ద పోలీసులను, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. కీసర గ్రామం నుండి, గుట్టవరకు, నడక దారిన లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాట్లు చేయాలని అన్నారు. లిక్కర్ గుట్టపైకి తేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు అవగాహన కల్గించే విధంగా 26శాఖల ద్వారా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని డిఆర్‌డిఏ అధికారులను కోరారు. శాంతియుత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలని తెలిపారు. జాతర జరిగే వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 274 ఆర్టీసి బస్సులు జాతర సందర్భంగా గతంలో నడిపారని, ప్రస్తుత జాతరకు అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌కు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఆర్టీసి ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకాకపోవటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కీసర నుండి గుట్ట వరకు ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సమన్వయం ఏదీ : జిల్లాలోనే అతి పెద్ధ జాతరైన కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. నూతనంగా మేడ్చల్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా కీసరగుట్ట జాతర సమావేశాలకు వివిధ రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం లేదని పలు పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంరోజుల పాటు జరిగే జాతరలో స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని తాము కోల్పోవాల్సి వస్తోందని అన్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిపిఓ సురేశ్‌మోహన్, డిఇఓ ఉషారాణి, గుట్ట ఆలయ చైర్మన్ టి.వెంకటేశ్, నారాయణశర్మ, జెడ్‌పిటిసి రమాదేవి, ఎంపిపి సుజాత, సర్పంచ్ గణేశ్, ఎంపిటిసిలు జంగయ్య, రమేశ్‌గుప్తా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే
మంత్రి హరీష్‌రావు
మోమిన్‌పేట, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో వంద శాతం అమలు చేసిన ఘనత ఇండియాలో నెంబర్ వన్‌గా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. మంగళవారం మోమిన్‌పేట మండల కేంద్రంలోని ఎజెఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కావడంతో ఇక్కడి ప్రజల కల సాకారమైందన్నారు. మోమిన్‌పేట ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి పాత పోలీసు స్టేషన్ గ్రామ పంచాయతీ కార్యాలయంకు అప్పగించడం జరుగుతుందన్నారు.
రూ.10కోట్లతో రెండు కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.500 కోట్లతో పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రజలకు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజీవ్‌రావు, యాదయ్య, ఎంఎల్‌సిలు యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, ఎంపిపి నిఖితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సావిత్రమ్మ పాల్గొన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించకుండా సమావేశంలో పాల్గొని వెళ్లిపోయారు.