రంగారెడ్డి

కార్పొరేట్ విద్యాసంస్థలపై కేసిఆర్ మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఫిబ్రవరి 9: కార్పొరేట్ విద్యాసంస్థలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మొగ్గు చూపుతున్నారని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా పోరాటయాత్ర బుధవారం రాత్రి కొడంగల్‌కు చేరింది. ఈసందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రొపెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ కెజి టూ పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని గతంలో ఇచ్చిన హామీని మరచిపోయారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మొగ్గు చూపుతూనే విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలోకి తేవడానికి ముఖ్యమంత్రి చొరవ చూపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆదేవిధంగా రిలయన్స్ సంస్థకు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రయత్నించడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వా విద్యాసంస్థల్లో సరైన వౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత ఉండటం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని , వసతుల కల్పనతో పాటు సరైన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న విశ్వవిద్యాలయాలన్నింటిలో పూర్తి స్థాయి వౌలిక వసతులతో పాటు అన్నిరకాల కోర్సులను ప్రారంభించి రెగ్యులర్ సిబ్బందిని నియమించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు వీలు కల్పించే చట్టాన్ని రద్దు చేయాలన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 30 శాతం నిధులను, కేంద్ర ప్రభుత్వ జిడిపిలో 6శాతం నిధులను కేటాయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలోకి కాషాయికరణ భావజాలాన్ని తేరాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యాదోపిడీకి వ్యతిరేకంగా ఈనెల 6 నుంచి 20 వరకు రాష్టవ్య్రాప్తంగా విద్యా పోరు బస్సు యాత్ర ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకువస్తామన్నారు. దీనిపై ప్రజలు స్పందించి కేసిఆర్ చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో కెఎన్‌ఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టివివి రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, అరుణాకర్, రాంచందర్, లక్ష్మినారాయణ, నర్సప్పలతో పాటు స్థానిక నాయకులు కృష్ణంరాజు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భవనప్ప, కె.చంద్రప్ప, రమేష్ ఉన్నారు.

కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ
వికారాబాద్, ఫిబ్రవరి 9: ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోతే మార్చిలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల సమయంలో నగరంలో కాంట్రాక్టు కార్మికుల భారీ ర్యాలీని నిర్వహిస్తామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య వెల్లడించారు. గురువారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఏఐటియుసి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో సామాజిక భద్రత పేర చట్టం తేవాలని అన్నారు. రైల్వే, రక్షణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల కారణంగా పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసినపుడే ప్రైవేటీకరిస్తున్నట్టు తెలుస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైల్వే, రక్షణ శాఖలకు ధారాదత్తం చేయడం దేశానికి ముప్పేనని వాపోయారు. కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ ఐసిఎల్ ఫ్యాక్టరీలో అకారణంగా తొలగించిన డిప్యూటీ జనరల్ సెక్రటరీని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను అణచేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా ప్రధానకార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, మున్సిపల్ స్ట్ఫా, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి సహదేవ్, జిల్లా అధ్యక్షుడు తివారి, ప్రధానకార్యదర్శి శరణప్ప, సహాయ కార్యదర్శి మక్బూల్ పాల్గొన్నారు.

పాత కక్షలతో యువకుడిపై దాడి.. మృతి
కుషాయిగూడ, ఫిబ్రవరి 9: యువకుడి మృతికి కారకులైన యువకులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి బంధువులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆందోళన చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వౌలాలి ఎస్‌పినగర్‌కు చెందిన కిరణ్ రోడ్లు తవ్వే కంప్రెషర్ యంత్రాన్ని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. గతంలో కాప్రా గాంధీనగర్‌కు చెందిన ప్రసాద్, నవీన్‌తో పాత గొడవలు ఉన్నాయి. ఈ నెల 2న కిరణ్ బృందావన్ కాలనీకి వెళ్తుండగా, ఆరుగురు యువకులు అడ్డగించి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయలపాలైన కిరణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కిరణ్ మృతికి కారకులైన ప్రసాద్, నవీన్, వెంకట్‌రావు, యాదగిరి, ప్రభాకర్, సుధాకర్‌లను అరెస్టు చేయాలని పోలీస్‌స్టేషన్‌లో కిరణ్ బంధువులు ఆందోళన చేశారు.
కాగా, కిరణ్ మృతికి కారకులైన ఆరుగురిని అరెస్టు చేయకుండా పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుధాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా నిందితతులను ఎందుకు అరెస్టు చేయడం లేదని కిరణ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.