రంగారెడ్డి

పాలమూరు ఎత్తిపోతల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 19, 20 తేదీల్లో ఎమ్మెల్యే పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, ఫిబ్రవరి 12; పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 19,20 తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహనరెడ్డి తెలిపారు. కులకచర్ల మండలం పాంబండ ప్రాంగణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ అందని ద్రాక్షగా మారుతున్నాయని, సామాన్య జనాలు నానా ఇక్కట్లకు గురవుతున్నారని ఆరోపించారు. జిరాక్స్‌లు తీయడం అధికారులకు ఇవ్వడం మినహా పథకాలేవీ ప్రజలకు అందడం లేదన్నారు. అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని షాద్‌నగర్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే డిసెంబరు నాటికి ఈ పథకం ప్రారంభం కాబోతున్నదని చెప్పారని కాని ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని మరీ ముఖ్యంగా పరిగి నియోజకవర్గ ప్రజలకు ఉపయుక్తంగా లేదని వాపోయారు. ఈ విషయంలో కాసింత చలనం వచ్చేందుకు తానే స్వయంగా ఈనెల 19 కులకచర్లలోని చెర్ల హనుమాన్ మందిరం నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పాంబండ మీదుగా పోలేపల్లె, తాండురు వరకు నిర్వహిస్తానని తెలిపారు.
అధికారికంగా సేవాలాల్ జయంతి
గిరిజనులు ఆరాధించే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈమేరకు ఆయా మండలాలకు కలిసి రూ.2 లక్షలు విడుదలయ్యాయన్నారు. ఎక్కడెక్కడ నిర్వహించేది ఆయామండలాల ఎంపిడి ఒలకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో కులకచర్ల మాజీ ఎంపిపి పర్మటి అంజిలయ్యగౌడ్, బంజారా నాయకులు విఠల్‌నాయక్, శివరాంనాయక్, అసైన్డ్ కమిటీ సభ్యుడు కర్రె భరత్‌కుమార్ పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

ఓ వైపు ఎమ్మెల్సీ
మరోవైపు టెన్త్ పరీక్షలు

ఉపాధ్యాయులకు పరీక్షగా మారిన ఎన్నికల క్యాంపెయిన్

వికారాబాద్, ఫిబ్రవరి 12: వచ్చే నెలలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు పరీక్షగా తయారైంది. వచ్చే నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడి ఎన్నిక ఉండటంతో ఉపాధ్యాయ సంఘాలు తాము నిలబెట్టుకున్న అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థి ఎన్నిక కోసం నిర్వహించే క్యాంపెయిన్(ప్రచారం)లో ఉపాధ్యాయులను సైతం భాగస్వాముల్ని చేయడంతోనే చిక్కంతా వచ్చి పడింది. పదో తరగతి పరీక్షలు వచ్చే నెలలోనే ఉండటం, మంచి ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి ఉండటంతో విద్యార్థులను సంసిద్దం చేసే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమై ఉండగా, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఉపాధ్యాయులను క్యాంపెయిన్‌కు రావాలని కోరుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేసే ఉపాధ్యాయ సంఘాల మాట వినాలా, తమపైనే ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు సమయం ఇవ్వాలా అని ఆలోచనలో ఉపాధ్యాయులు. అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలకు న్యాయం చేసే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిను రూపొందించుకుంటున్నారు.

శ్రీ మహాత్మా బసవేశ్వరుని అడుగుజాడల్లో నడుచుకోవాలి

మర్పల్లి, ఫిబ్రవరి 12: శ్రీ మహాత్మా బసవేశ్వరుని అడుగుజాడల్లో మానవులు నడుచుకోవాలని శ్రీ గురు గంగాధర శివాచార్య మహాస్వామి (మల్కేడ్, తంగడపల్లి) వారు సూచించారు. ఆదివారం నాడు మర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన ‘‘అశ్వారూఢ శ్రీ మహాత్మా బసవేశ్వరు’’ని విగ్రహావిష్కరణను జ్యోతి ప్రజ్వలన చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ కుల, వర్ణ, లింగ, వివక్షను ఎండగట్టి సమసమాజ నిర్మాణాన్ని నిర్మించాలనే తపనతో అన్ని కులాల వారిని ప్రేమించి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషిచేసిన మహా పురుషుడని అన్నారు.
మహాత్ములు ముగ్గురేనని మొదటివాడు మహాత్మా బసవేశ్వరుడని, రెండవవాడు మహాత్మా జ్యోతిరావుపూలే, మూడవ వ్యక్తి మహాత్మాగాంధీ అని తెలిపారు. అలాంటి మహాత్ముని విగ్రహాన్ని మర్పల్లిలో ఏర్పాటు చేసుకోవడం మర్పల్లి ప్రాంత ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.