రంగారెడ్డి

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, ఫిబ్రవరి 13: దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి పేర్కొన్నారు. అవంతి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లి వేడుకలను సోమవారం కొత్తపేట్‌లోని వైట్‌హౌస్‌లో తరంగ్-2017పేరుతో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రి వైఎస్ చౌదరి, ఆంధ్రజ్యోతి ఎండి రాధకృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.రాంచంద్రం, సినీ హీరో మంచుమనోజ్, కళాశాల చైర్మెన్ ఎం.శ్రీనివాసరావు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మంచు మనోజ్ తన చమత్కార మాటలతో విద్యార్థులను కేరింతలు కొట్టించారు. మంత్రి చౌదరి మాట్లాడుతూ కొద్ది మంది విద్యార్థులతో కళాశాలను స్థాపించిన చైర్మెన్ శ్రీనివాసరావు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కళాశాలలను విస్తరించారని తెలిపారు. విద్యతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సిని హీరో మంచుమనోజ్ మాట్లాడుతూ యువత అనుకుంటే దేనినైన సాధించవచ్చని, ఆ దిశగా విద్యార్థులు అనుకున్న లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అబ్బుర పరిచాయి. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత టి.హనుమన్ చౌదరి, కళాశాల ప్రధాన కార్యదర్శి ఎం.ప్రియాంక, ఉపాధ్యక్షుడు ఎంవిఎస్‌ఎస్ నందీష్, ప్రిన్సిపల్ పోచన్న, డైరెక్టర్ జయప్రద పాల్గొన్నారు.

శరణం గచ్చామి చిత్రాన్ని వెంటనే విడుదల చేయాలి
వికారాబాద్, ఫిబ్రవరి 13: శరణం గచ్చామి చిత్రాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రజాభిప్రాయవేదిక రాష్ట్ర సమన్వయకర్త పెండ్యాల అనంతయ్య ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో భారత రాజ్యాంగంలోని సమానహక్కులు ప్రాథమిక హక్కులు, రాజర్వేషన్ల అవకాశాలు, రాజ్యాంగ ఫలాలు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు అందినపుడే సామాజిక న్యాయం జరుగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలతో రూపొందిన చిత్రం శరణం గచ్చామి అని తెలిపారు. సినిమాతో దళిత, అణగారిన అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి సందేశాన్నిచ్చేదిగా రూపొందించారని, సినిమాను ప్రేక్షకుల హక్కుగా భావించాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. సినిమా, వినోదం, విజ్ఞానం, సాంకేతిక, సాంస్కృతిక, కళా, సమాచార రంగాలు రాజ్యాంగం కల్పించిన భారత పౌరుల హక్కని అన్నారు. హక్కులు అన్ని వర్గాల ప్రజలకు అందాలనే ఉద్దేశ్యంతో సందేశం రూపంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిని చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత, అణగారిన వర్గాలు సినీ రంగాల్లో రాణించాలంటే సెన్సార్ బోర్డులో ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకు సభ్యులుగా రిజర్వేషన్ కల్పించాలని అభిప్రాయపడ్డారు. నేటి సినిమా రంగం కొందరి వారసత్వంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం మారాలని, అన్ని వర్గాల్లో అద్భుతమైన కళాకారులున్నారని స్పష్టం చేశారు. దర్శకులు, నిర్మాతలు, రచయితలున్నారి, వారి ప్రతిభను గుర్తించాలని సూచించారు. ప్రజలను చెడుదారి పట్టించి, ప్రజలు, ప్రేక్షకులకు ఉపయోగం లేని సినిమాలు, సీరియల్స్‌ను నిషేధించాలని పిలుపునిచ్చారు.