రంగారెడ్డి

చారిత్రాత్మక వరద కాలువలు కబ్జా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 14: హయత్‌నగర్ మండల రెవెన్యూ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ శివారు ప్రాంతంలోని సాహెబ్‌నగర్ రెవెన్యూ సర్వేనెంబర్ 140లోసహజ సిద్ధంగా ఏర్పడ్డ చారిత్రాత్మక వరద కాలువలను భూ కబ్జాదారులు యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఈవిషయం ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పాటు భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల పొడవు, వెడల్పు, లోతు తగ్గిస్తూ తవ్వడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొనే్నళ్ల క్రితం హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ చెరువు నుంచి సాహెబ్‌నగర్ కాలనీ మీదుగా హయత్‌నగర్ బాధితుల చెరువుకు పొలాల మధ్య నుంచి సహజ సిద్ధమయిన కాలువ ఉంది. ఆ కాలువ ద్వారా రెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన రైతులు పొలాలు సాగుచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి కాలువ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి మూలంగా ప్రతిఏటా పూడికతీత పనులు కూడా సరిగా చేయకపోవడంతో కాలువ రూపురేఖలు రోజురోజుకు అంతరించి పోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పట్టా భూములకు చెందిన రైతులు, రియల్టర్లు కాలువను కొద్దికొద్దిగా కుదించేస్తూ ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాహెబ్ నగర్, ఇంజాపూర్ సరిహద్దులో రెండు మీటర్లు ఉన్న కాలువను మూడు ఫీట్లకు కుదించి దాని రూపాన్ని కూడా తారుమారు చేస్తున్నా, సంబంధిత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల అనుమతులు లేకుండా సహజసిద్ధమయిన కాలువను తగ్గించి కుదించి వేయాలని చూడటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికయినా ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులు సంబంధింత కాలువ పూర్తి వివరాలు సేకరించి చారిత్రాత్మక వరదకాలవను కాపాడాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పురాతన కాలం నాటి చెరువులు, కాలువల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా అందుకు భిన్నంగా ఇక్కడి ఇరిగేషన్ అధికారులు భూకబ్జాదారులకు వత్తాసు పలుకడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జా అయ్యే కాలువలను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు భక్షించే వారికి వత్తాసు పలకడం పట్ల ఉన్నత స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు కోరుతున్నారు.

మతం పేరుతో
రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటాం
బాలాపూర్, ఫిబ్రవరి 14: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పూనుకుందని బిజెపి రాష్ట్ర నాయకుడు కొలను శంకర్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బిజెవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బి.జగన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నాదర్‌గుల్ ఎంవిఎస్‌ఆర్ కళశాల ముందు నిర్వహించిన, సంతకాల సేకరణ కార్యక్రమానికి శంకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌రెడ్డి మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల తీర్పు కోర్టులో పెండింగులో ఉండగానే, కేసిఆర్ 12 శాతం రిజర్వేషన్లను ఎలాఇస్తారని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కాకుండా వారి అభ్యున్నతికి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల భావోద్వేగ విషయాలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ప్రభుత్వం తొందరపాటు మంచిది కాదని శంకర్‌రెడ్డి సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే బిజెపి రాజీలేని పోరాటం చేసి రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు సామ సంజీవరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, ఏనుగు రాంరెడ్డి, పెత్తుల పుల్లారెడ్డి, నిమ్మల శ్రీకాంత్‌గౌడ్, రామిడి మహేందర్‌రెడ్డి, బంద్యాల శంకర్‌రెడ్డి, భాస్కర్, ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.