రంగారెడ్డి

కేసిఆర్ త్యాగాలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఫిబ్రవరి 17: కేసిఆర్ త్యాగాలు తెలంగాణ ప్రజల గుండెలో స్థిర స్థాయిగా నిలుస్థాయని సరూర్‌నగర్ ఎంపిపి తీగల విక్రంరెడ్డి కొనియాడారు. శుక్రవారం కేసిఆర్ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లెలగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపిపి తీగల విక్రంరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేసిఆర్ అలుపులేని పోరాటం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.
శామీర్‌పేటలో..
శామీర్‌పేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినోత్సవాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు అందజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసిఆర్ కీలక పాత్ర పోషించారని టిఆర్‌ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అనేక అభివృద్ధిపనులు చేపట్టి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణను నిలబెట్టిన ఘనత కెసిఆర్‌కే దక్కిందని వివరించారు.
బాలాజీనగర్‌లో..
కెపిహెచ్‌బికాలనీ: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి అమోఘమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరై టిఆర్‌ఎస్ నాయకులు పన్నాల హరీష్‌రెడ్డితో కలిసి కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, వార్టు కమిటీ సభ్యులు సాయినాథ్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, అరుణ, శ్రీలత, నాయకులు సుగుణ, శ్రీను, మహబూబ్ పాల్గొన్నారు.
కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
తెలిపిన నేతలు
జీడిమెట్ల: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో కెసిఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే కెపి వివేక్, ఎమ్మెల్సీ రాజులు కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, కార్పొరేటర్‌లు రావుల శేషగిరి, సత్యనారాయణ, నాయకులు కొలను శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక నాయకుడు ఎత్తరి మారయ్య ఆధ్వర్యంలో కేసిఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
హఫీజ్‌పేటలో
శేరిలింగంపల్లి: కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం హఫీజ్‌పేటలోని డివిజన్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. హఫీజ్‌పేట, మాదాపూర్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్‌గౌడ్‌లు కేక్ కట్‌చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు.
వేడుకల్లో టిఆర్‌ఎస్ నాయకులు బాలింగు యాదగిరిగౌడ్, మిద్దెల మల్లారెడ్డి, ఎక్కె బాల్‌రాజ్, సంగారెడ్డి, జెరిపాటి రాజు, కె.వెంకటేశ్‌గౌడ్, ప్రవీణ్, కృష్ణముదిరాజ్, ధర్మారెడ్డి, సదానందరెడ్డి, తాహెర్, సత్తార్, హున్యానాయక్, బాబుమియా, ఆశ, పద్మ, మమత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
తారానగర్ మార్కెట్‌లో..
కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తారానగర్ కూరగాయల మార్కెట్‌లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగెందర్‌యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతయాదవ్‌లు పేదలకు అన్నదానం చేశారు. జిహెచ్‌ఎంసి అందిస్తున్న రూ.5 భోజన పథకంలో భాగంగా కార్పొరేటర్ ఆ మొత్తాన్ని తానే చెల్లించి వారితో కలిసి రాగం సుజాత, నాగేందర్ యాదవ్ భోజనం చేశారు. వేడుకల్లో మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, గుర్రపు రవీందర్‌రావు, నాయకులు బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి, బద్దం కొండల్‌రెడ్డి, ఖాజాపాషా, అహ్మద్, శ్రీనివాస్, రంగనాథ్, రాజు పాల్గొన్నారు.
చందానగర్‌లో..
కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమినగర్‌లో గల బధిరుల పాఠశాలలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. చెవిటి, మూగ, అంధులైన చిన్నారులకు కార్పొరేటర్ కేక్ తినిపించి, పండ్లు పంచి పెట్టారు. వేడుకల్లో టిఆర్‌ఎస్ సీనియర్ నేత బొబ్బ విజయ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ కె.సునీతారెడ్డి, పార్నంది శ్రీకాంత్, మిరియాల ప్రకాశ్, శ్రీనివాస్‌నాయక్, రాజన్న, కృష్ణారెడ్డి, పోచయ్య, సలీం, గౌస్, ప్రమోద్, సులోచన, అరుణ, రాధిక, ప్రిన్సిపాల్ రాధిక పాల్గొన్నారు.
శంషాబాద్‌లో..
శంషాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నర్విహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసిఆర్ చిత్రపటం వద్ద కేక్‌కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
పార్టీ సీనియర్ నాయకుడు కె.చంద్రారెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు దండు ఇస్తారి, మోహన్‌రావు, రమేష్, నీరటి రాజు, వెంకటేశ్‌గౌడ్, సుభాష్, మహేందర్‌రెడ్డి, పాశం శ్రీ్ధర్, దీప మల్లేష్, వీరేశ్ పాల్గొన్నారు. మండల పరిధిలోని హుడాకాలనీలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ మంచర్ల మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఊటుపల్లిలో విద్యార్థులకు బట్టల పంపిణీ
మండలంలోని ఊటుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉప సర్పంచ్ కౄష్ణకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు, పలకలు, బూట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మురళీగౌడ్, ఉపాధ్యక్షుడు హరి, వార్డు సభ్యులు మనోహర్‌గౌడ్, పాండు, కిరణ్ పాల్గొన్నారు.