రంగారెడ్డి

ఇంటికో ఉద్యోగమన్న కేసిఆర్ ఇంటిలోనే నాలుగు ఉద్యోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 20: దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సిఎం కేసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన జన ఆవేదన సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసిఆర్ ఊరికో ఉద్యోగం ఇవ్వకపోగా తన ఇంటిలో మాత్రం నాలుగు ఉద్యోగాలు పొందారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ తుగ్లక్ చర్యకు నిదర్శనమని, నోట్ల రద్దు కారణంగా దేశానికి నష్టం, అభివృద్దికి ఆటంకం కలిగిందని తెలిపారు. విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చి జనధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని 15 రూపాయలైనా జమ చేయలేదని ఎద్దేవా చేశారు. భారత దేశంలో ఎక్కడా జరగని అవినీతి మిషన్ భగీరథలో జరిగిందని ఆరోపించారు. వెనుకబడిన పరిగి ప్రాంతానికి నీరిచ్చేందుకు డిజైన్ రూపొందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పూటకో మాట మాట్లాడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు నీరివ్వకుండా ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టారని ధ్వజమెత్తారు. 1200 మంది బలిదానాన్ని గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం బలిదానం చేసుకున్న వారి గుర్తించకపోవడం దారుణమని అన్నారు. ఇది దగుల్బాజి ప్రభుత్వమని, దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే అడ్డుకున్న కేసిఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం వేలల్లో ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించగా, మూడేళ్ళ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్‌బెడ్‌రూమైనా నిర్మించకపోవడం విచిత్రకరమన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళకు బిల్లులు చెల్లించపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
శాసనసభ, శాసనమండలిలో నిలదీసి బిల్లులు ఇప్పిస్తామని, ఇవ్వకపోతే రెండేళ్ళలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అపుడు ఇప్పిస్తామని భరో ఇచ్చారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఇబ్బందులుపెట్టిన అధికార పార్టీ, అధికారుల భరతం పడతామని హెచ్చరించారు.
కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 20: శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. రామలింగేశ్వరస్వామికి షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ అర్చకులు ప్రహ్లాదాచార్యులు, రవీందర్‌రావు, కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వంలతోపాటు కౌన్సిలర్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వామివారి కల్యాణోత్సవంలో చాలా మంది దంపతులు పాల్గొని కల్యాణం నిర్వహించారు.
ప్రసిద్ది చెందిన ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు వివరించారు. మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ ఆర్టీసి డిపో నుంచి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు వివరించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యంతోపాటు స్నానపు గదులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కోనేరు శుభ్రంగా చేసి నీరు అందులోకి వదిలేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు.