రంగారెడ్డి

అధికారం కోసం ఎన్నో హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఫిబ్రవరి 20: అధికారం కోసం టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హమీలను పెట్టిందని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, తమ్మన్నగారి రాంమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మినీ స్టేడియంలో జన ఆవేదన సమ్మేళనం సదస్సు జరిగింది.
పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పనులు వెంటనే వికారాబాద్ జిల్లాలలో ప్రారంభించాలని కోరుతూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కుల్కచర్ల మండలం నుంచి సభాస్థలి వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు లక్ష రుపాయల రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి లాగిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకువచ్చిందని మండిపడ్డారు. మహిళలకు పావుల వడ్డికే రుణాలు ఇచ్చిన ఘనతే కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి అప్పటి రంగారెడ్డి ప్రజలకు టిఆర్‌ఎస్ తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. టిఆర్‌ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. పరిగిలోని సయ్యద్‌పల్లి, భొంపల్లి, రాఘవపూర్, ఉమ్మేంతాల్, చిట్టంపల్లి గ్రామాలలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఒక్క కుటుంబానికే ప్రభుత్వం నష్టపరిహరం ఇచ్చిందని, మిగతా కుటుంబాలను విస్మరించిందని ఆరోపించారు. వికారాబాద్ నుంచి మక్తల్ వరకు రైల్వేలైన్ గురించి అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం 50శాతం నిధులు ఇచ్చిందని, సర్వేలు సహితం చేయించిందని చెప్పారు. కేంద్రంలో పెద్ద మోదీ, రాష్ట్రంలో చిన్న మోదీ.. తుగ్లక్ పాలనను చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాం జోలికి కేసిఆర్, తెరాస నేతలు వెళ్లొందని, ఉద్యమంలో అతను ఉక్కు మనిషిగా పనిచేశారని హెచ్చరించారు. పరిగిలో జన ఆవేదన సమ్మేళన సదస్సు జరుగుతుందని తెలుసుకున్న హరీష్‌రావు.. వికారాబాద్‌కు వచ్చి మాయమాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. కేసిఆర్‌పై ప్రజలు తిరుగబడే సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి తెలంగాణలో జరుగుతుందని, మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పరిగి నియోజకవర్గంలో 42వేల మందికి ఇళ్లు ఇచ్చారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ మంత్రి చంద్రశేఖర్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మధు యాస్కీ గౌడ్, డికె అరుణ, మల్లు రవి పాల్గొన్నారు.

ధూల్‌పేట్ నిర్వాసితులకు
కార్లు అందజేత
బాలాపూర్, ఫిబ్రవరి 20: ధూల్‌పేట్‌లో గుడుం బా బంద్ చేసి నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభు త్వం అనేక ప్రత్యామ్నాయ కార్యక్రమాలు అమలు చేస్తుందని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. సోమవారం ధూల్‌పేట్ గుడుంబా బంద్ చేసిన కుటుంబాలకు పునరావాసంలో భాగంగా..కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, లఖన్‌సింగ్‌ల కుటుంబాలకు రెండు కార్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పించే పునరావాస కార్యక్రమాలను 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుడుంబా తయారీ మానేసినందున ఆయా కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలపై అవగహన కలదని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని అన్నారు. రాబోయే రోజులో ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మంగళ్‌హట్, గోషామహల్ కార్పొరేటర్లు పరమేశ్వరి సింగ్, ముఖేష్ సింగ్, ఎక్సైజ్ శాఖ డిప్చూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతి కిరణ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి పాల్గొన్నారు.