రంగారెడ్డి

నేడు సిఎం కేసిఆర్ కీసరగుట్టకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 23: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మావాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుశుక్రవారం ఇక్కడకు రానున్నట్టు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కీసరగుట్టకు చేరుకుంటారన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా రాచకొండ కమీషనర్ మహేశ్‌భగవత్ హెలిప్యాడ్ కోసం గురుకుల పాఠశాల ఆవరణలో స్ధలాన్ని పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ దిగగానే ప్రత్యేక వాహనంలో ఆలయం మీదకు కేసిఆర్ వెళతారు. ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఐదు అంతస్తుల రాజగోపురం నుండి శ్రీరామలింగేశ్వరుని దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం ఆలయ వెనుకభాగం నుండి ప్రత్యేక వాహనంలో తిరిగి హెలిప్యాడ్ చేరుకుంటారు. ఇప్పటికే పోలీసులు కీసరగుట్ట పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయం

హైదరాబాద్, ఫిబ్రవరి 23: పాతబస్తీ బండ్లగూడ మండలం పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణే ద్యేయంగా పనిచేస్తానని బండ్లగూడ మండల ఇన్‌చార్జి తహశీల్దార్ ఇ.నవీన్ చెప్పారు. బండ్లగూడ తహశీల్దార్‌గా పనిచేసిన కె.అనిల్‌కుమార్ పదోన్నతిపై ఆర్‌డిఓగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ప్రస్తుతం బహాదూర్‌పుర తహశీల్దార్‌గా పనిచేస్తున్న నవీన్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నవీన్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి సమాచరాన్ని అందించడంలో స్థానిక ప్రజలు సహకరించాలని అన్నారు. బండ్లగూడ మండల పరిధిలో విలువైన ప్రభుత్వ భూములున్నాయని వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. పింఛన్ల పంపిణీలో ఏవైన ఇబ్బందులు ఉంటే నేరుగా మండల కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులను కోరారు. కుల, ఆధాయ, నివాస పత్రల జారీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించి కనీస సౌకర్యాల రూపకల్పనకోసం సంబంధిత శాఖ అధికారులతో కలిసి పర్యటిస్తామని చెప్పారు.