రంగారెడ్డి

ప్రైవేటు వైద్యంపైనా కలెక్టర్ దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 24: పేదప్రజలకు వైద్య సేవలు మెరుగుపడాలని తపన పడుతున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రైవేటు వైద్యంపైనా దృష్టి పెట్టాలని వికారాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ దివ్య బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే తాండూర్ జిల్లా ఆసుపత్రి సంఘటనలో తీసుకున్న చర్యలు, వికారాబాద్ ఏరియా ఆసుపత్రి పలుమార్లు తనిఖి, ఇటీవలే సిద్దులూర్, దోమ, కుల్కచర్ల, పరిగి ఏరియా ఆసుపత్రుల అభివృద్దికి, ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతపర్చాలనే ఉద్దేశంతో ఆమె చేస్తున్న కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. కాని గత 15 రోజులుగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే నిర్లక్ష్యం చవి చూడాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ పట్టణాల్లో చోటు చేసుకున్న సంఘటనలే అందుకు నిదర్శనం. మెరుగైన వైద్యం అందించేందుకు శాయశక్తులా శ్రమిస్తున్న కలెక్టర్ ప్రైవేటు ఆసుపత్రులపైనా దృష్టిపెట్టి సంఘటనలు జరగకుండా చూడాలని అలా వీలు కాకపోతే సంబంధిత శాఖకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్దింగాంచిన అనంతగిరి టిబి శానిటోరియంలో సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కలెక్టర్ ప్రయత్నిస్తుండగా మరో వైపు టిబి ఆసుపత్రిలో రోగి మృతిచెందడం బాధాకరం.

మియాపూర్‌లో సామూహిక
రుద్రాభిషేకం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మియాపూర్‌లో సామూహిక రుద్రాభిషేకం నిర్వహించారు. మియాపూర్, హఫీజ్‌పేట పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకంలో పాల్గొని శివుడికి పూజలు చేశారు. హఫీజ్‌పేట, మాదాపూర్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్‌గౌడ్ జంట రుద్రాభిషేకంలో పాల్గొని పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీస్ మియాపూర్ కేంద్రం ఇన్‌చార్జి బికె నీలిమ, శషి, నాయకులు రఘునాథరావు, పలువురు బ్రహ్మకుమారీలు, భక్తులు పాల్గొన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం
ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 81వ శివ జయంతి ఉత్సవాలు మియాపూర్ కేంద్రం వద్ద ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. భారత దేశంలోని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఇక్కడ అద్భుతంగా రూపొందించి దర్శనానికి సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు.