రంగారెడ్డి

రంగారెడ్డి కోర్టుకు స్నేక్‌గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, మే 10: మానవీయ విలువలను మంటగలుపుతూ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్నేక్ గ్యాంగ్‌ను చర్లపల్లి జైలు నుండి భారీ భద్రత నడుమ రంగారెడ్డి కోర్టుకు తరలించిన్నట్లు జైలు అధికారులు తెలిపారు. 2014 జూలై 14న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునేలా యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్నేక్ గ్యాంగ్ ఆరుగురిని చర్లపల్లి జైలులో ఉంచినట్లు తెలిపారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా వున్న నిందితుడు ఫైసల్ దయాని, ఖాదర్ బరాక్భ, తయ్యబ్ బసలమా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్భ్, సలామ్ హాండీలను రంగారెడ్డి కోర్టుకు తరలించగా కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేయడంతో తిరిగి చర్లపల్లి జైలుకు తరలించినట్లు జైలు సూపరింటెండెంట్ కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.