రంగారెడ్డి

మచిలేశ్వర్ దేవాలయంలో డిజిపి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పండుగ పురస్కారించుకుని శ్రీవీరభద్ర మచిలేశ్వర్ స్వామి దేవాలయంలో శివలింగానికి రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ దంపతులు అభిషేకం నిర్వహించారు. శుక్రవారం మద్యాహ్నాం గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో గుట్టపై ఉన్న శ్రీవీరభద్ర మచిలేశ్వర్ స్వామి దేవాలయంలో శివలింగానికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసు ఉన్నాధికారులు కూడా వచ్చి శివలింగానికి అభిషేకం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం తెల్లవారుఝాము వరకు మచిలేశ్వర్ దేవాలయంలో పూజలు కొనసాగాయి. భజన కార్యక్రమాలు జరిగాయి. దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు బారులు తీరారు.

కొడంగల్ మార్కెట్ యార్డుకు
పాలకమండలి అవసరం
కొడంగల్, ఫిబ్రవరి 24: కొడంగల్ పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుకు పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు, ప్రజలు కోరుతున్నారు. కొడంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు కోస్గి మార్కెట్ యార్డుకు సబ్ యార్డుగా పనిచేస్తుంది. కోస్గి మార్కెట్ కమిటీ పాలక మండలి ఆధ్వర్యంలో కొనసాగుతూ వచ్చింది. 1993 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడంగల్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. తరువాత మార్కెట్ యార్డు కంపౌండ్ వాల్‌తో పాటు దుకాణ సముదాయాలను నిర్మించారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని రైతులు తాము పండించిన పంటను పోరుగున ఉన్న తాండూరు మార్కెట్ యార్డుకు తరలిస్తుంటారు. దానిని దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బందులు కల్గుతున్నాయని నేపంతో కొంత మంది వ్యాపారులు కొడంగల్‌లోనే రైతుల పంటను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సరైన ఫలితాలు సాధించలేకపోయారు. అప్పటి నుంచి మార్కెట్ యార్డులో లావాదేవిలు జరుగలేదు. కొడంగల్ సబ్‌యార్డుకు రైతులను ఆదుకోవడానికి గాను ఆదేవిధంగా పంట భద్రతకు కొడంగల్ మార్కెట్ యార్డులో ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు మార్కెట్ గోదాంకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదాం నిర్మాణం చేపట్టారు. రైతులు పండించిన పంటను గోదాములలో నిల్వచేసుకోవచ్చని భావించి ప్రస్తుత ప్రభుత్వం అదే స్థలంలో గత సంవత్సరం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని రైతులే కాకుండా పక్క నియోజకవర్గాల రైతులు కూడ తాము పండించిన పంటలను కొడంగల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తోలగినట్లు అయింది. అయితే జిల్లాలో పునర్విభజనలో బాగంగా కోస్గి వ్యవసాయ మార్కెట్ యార్డు మహబుబ్‌నగర్ జిల్లాలో చేరగా దానికి సబ్ యార్డుగా పనిచేస్తున్న కొడంగల్ మార్కెట్ యార్డు నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు చేరింది. దీంతో చీలిక దశకు చేరిన తరుణంలో నూతనంగా ఏర్పటుచేసే పాలన వర్గంతో కొడంగల్ మార్కెట్ యార్డుకు కూడా పాలక మండలిని ఏర్పాటు చేయాలని అటు రైతులు ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేటేడ్ పోస్టులను భర్తీలో భాగంగా కొడంగల్ మార్కెట్ యార్డుకు కూడా కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ రైతుల ఇబ్బందులను తొలగించాలని కృషి చేయాలని కోరుతున్నారు.