రంగారెడ్డి

ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తకోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 24 : హరహర మహాదేవ శంభోశివ శంభోఅంటూ భక్తుల శివనామస్మరణతో కీసరగుట్ట మార్మోగింది. శుక్రవారం నాడు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఓం నమఃశివాయ అంటూ భక్తులు శ్రీరామలింగేశ్వరుడిని దర్శించుకొని పునీతులయ్యారు. రాష్ట్ర నలుమూలలనుండి తరలివచ్చిన శివభక్తులతో కేసరిగిరి క్షేత్రం కిటకిట లాడింది. తెల్లవారుజామునుండి రాత్రి వరకు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా మధ్యాహ్నం అనంతరం భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి దర్శనానంతరం భక్తులు కాశీవిశే్వశ్వరాలయం, శ్రీలక్ష్మీనృసింహస్వామి, నాగదేవత, శ్రీలక్ష్మీప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకొని పునీతులయ్యారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో కొలువైన శివలింగాలకు భక్తులు పంచామృతాలతో అభిషేకాలు చేసారు. గుట్టదిగువ భాగాన గల పార్కులో, చలువ పందిళ్లకింద భక్తులు సేదదీరారు.
శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం
శ్రీ్భవాని శివదుర్గ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వపరంగా శ్రీస్వామి వారికి పట్టు వస్త్రాలు మేడ్చల్ ఎంఎల్‌ఏ ఎం.సుధీర్‌రెడ్డి దంపతులు సమర్పించారు. ఉత్సవాల్లో మొదటిరోజు రాత్రి స్వామివారిని నందివాహన సేవలో కీసరగుట్ట నుండి కీసర గ్రామానికి చేరుకుంటారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తానికి శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు.
రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా వివిధ రకాల పూలతో అలంకరించిన వేదికపైన వేదపండితులు శ్రీస్వామివార్ల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. అశేషంగా తరలి వచ్చిన భక్తులు స్వామివార్ల కల్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించారు. టిటిడి వేద పండితులు గణపతిశర్మ బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రామ్‌కో సిమెంట్ వారు భక్తులకు ఉచితంగా మజ్జిగ, నీటి పాకెట్‌లను అందజేయటంతో పాటు, భక్తులకు దారి సూచించే సూచికబోర్డులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు. ఈసందర్భంగా కీసరగుట్టకు విచ్చేసిన భక్తులకు ఆర్యవైశ్య నిత్యఅన్నదాన సత్రం, మార్వాడీసంఘం, బ్రాహ్మణ అన్నదాన సత్రం, వంశీరాజ్ అన్నదాన సత్రం, మున్నూరుకాపు అన్నదాన సత్రంలతోపాటు దేవాలయంవారు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఏర్పాట్లపై కలెక్టర్ పర్యవేక్షణ
ఈసారి నూతనంగా మేడ్చల్ జిల్లా ఏర్పాటు కావటంతో జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్‌లు గురువారం అర్ధరాత్రి వరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూలైన్లు, స్వామి వారి మంటపంలో, ప్రసాదం కౌంటర్‌ల వద్ద, విఐపి క్యూలైన్లు, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసారి ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేసారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
మహాశివరాత్రి సందర్బంగా శ్రీరామలింగేశ్వరస్వామిని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపి సిహెచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కనకారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె. వెంకట్‌రెడ్డి, ఎమ్మేల్సీలు శంభీపూర్ రాజు, జనార్ధన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బిసి కమీషనర్ చైర్మన్ రాములు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్‌లతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయచైర్మన్ టి.ఉమాపతిశర్మ, ఇఓ వెంకటేశ్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సిఎం కేసీఆర్ పర్యటన రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీసరగుట్ట పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దు అయింది. జిల్లా యంత్రాంగానికి సిఎం వస్తున్నట్టు సమాచారం అందటంతో జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్‌లు పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు చేసారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పర్యటన రద్దు అయినట్టు సమాచారం రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాగోలులోని కాశీవిశే్వశ్వరాలయంలో
వనస్థలిపురం: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్‌లోని శివాలయాలు శివ నామ స్మరణంతో మారుమోగాయి. కిటకిటలాడుతున్న భక్తుల సౌకర్యార్దం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. నాగోలు డివిజన్ జైపూరి కాలనీలోని శ్రీకాశీ విశే్వశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం, అర్చనలు, సాయంత్రం 5గంటలకు రుద్రహోమం, పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు శ్రీవిశాలాక్షి, విశే్వశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. రాత్రి 10 గంటల నుండి 12గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్పటిక లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్వాహకులు ములుగు హనుమంత్ రావు, ముదిగొండ చంద్రశేఖర్, కొండపల్లి శంకర్ రావు, నాగేశ్వర్ రావుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను చేశారు
భక్తిశ్రద్ధలతో శివపూజలు
అల్వాల్: కంటోనె్మంట్, అల్వాల్ ప్రాంతంలో శివాలయాలు అన్నీ కిటకిట లాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంటోనె్మంట్ - అల్వాల్‌లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తితో ఉపవాసాలు నిర్వహించి సాయంత్రం శివాలయాలకు వెళ్లి శివున్ని దర్శించుకున్నారు. కంటోనె్మంట్ బోయిన్‌పల్లిలోని శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు చామకూర మల్లారెడ్డి, కటుంబసభ్యులతో కల్సి పూజల్లో పాల్గొన్నారు. అయనతోపాటు కంటోనె్మంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాసనగర్ కాలనీలోని శివాలయంలో జరిగిన ప్రత్యేకపూజలో కంటోనె్మంట్ బోర్డుమాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు పాండుయాదవ్ సతీసమేతంగా పాల్గొన్నారు. మారేడ్‌పల్లి, రసూల్‌పురా, తిరుమలగిరి, బొల్లారం, డౌటన్‌బజార్ ప్రాంతంలో శివాలయాలు కిటకిటలాడాయి. అల్వాల్‌లో కూడా భక్తులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఎటుచూసినా భక్తులు శివనామ స్మరణచేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేసి సాయంత్రానికి విరమించే సమయానికి పండ్లకు గిరాకీ పెరిగింది. రట్నపురి గడ్డ సాధారణంగా 10 రూపాయలకు కిలో ఉండేది. దానిని ఏకంగా 30 రూపాయలకు పెంచారు.

యువతి ఆత్మహత్యా యత్నం కేసులో బిల్డర్ అరెస్టు
ఉప్పల్, ఫిబ్రవరి 24: మహిళ ఆత్మహత్యా కేసులో బిల్డర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం సనత్‌నగర్ మమతనగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ (45) బిల్డర్. అతడు భార్య పిల్లలు ఉండగా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మైలాండ్ డెవలపర్స్‌లో పని చేస్తున్న బోడుప్పల్‌లో నివసించే ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం గడుపుతున్న ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.