రంగారెడ్డి

అమెరికాలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఎల్‌బినగర్, ఫిబ్రవరి 24: రెప్ప తెరిస్తే జననం.. రెప్ప మూస్తే మరణం. జనన మరణాల కాల గమనంలో అమెరికాలో జాతి విద్వేషానికి ఓ హైదరాబాదీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ. ఉజ్వల భవిష్యత్ వెత్తుక్కుంటూ అమెరికా వెళ్లిన యువకుడి కన్న కలలు తీరకుండానే జాతి విద్వేషానికి బలయ్యాడు. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలోని ఒలాథె పట్టణంలోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్స్‌లో అడమ్ పూరింటన్ అనే వ్యక్తి తీవ్రవాదులారా మీరు దేశం విడిచి వెళ్లండి అంటూ హెచ్చరించి మరీ జరిపిన కాల్పులకు అక్కడ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న కూచిబొట్ల శ్రీనివాస్ మృతి చెందగా, అలోక్‌రెడ్డి గాయపడ్డాడు. శ్రీనివాస్ కుటుంబం గండిమైసమ్మ దుండిగల్ మండల పరిధిలోని మల్లంపేట్ గ్రామం పరిధి ప్రణీత్ నేచర్ బ్రౌంటీలో నివాసం వుంటోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎల్‌బినగర్ ఆర్కేపురం డివిజన్ ఇందిరానగర్ కాలనీలోని వాసవీ రెసిడెన్స్‌లోని అల్లోక్‌రెడ్డి కుటుంబం నివాసం వుంటోంది.

శామీర్‌పేట చెరువులో పడి
ఇద్దరు విద్యార్థుల మృతి
శామీర్‌పేట, ఫిబ్రవరి 24: సరదాగా ఈత కొట్టడానికి వచ్చిన విద్యార్థుల బృందంలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగిన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని చర్లపల్లికి చెందిన సాయి (18), సికింద్రాబాద్‌కు చెందిన విష్ణువర్థన్ (18) మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు. గురువారం సాయంత్రం వీరితో పాటు 13మంది విద్యార్థుల బృందం శామీర్‌పేట పెద్దచెరువువద్దకు వచ్చారు. అనంతరం సరదాగా ఈతకోసం చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు సాయి, విష్ణువర్థన్ నీట మునిగిపోయారు. వెంటనే మిగతా విద్యార్థులు అక్కడి నుండి భయంతో వెళ్లిపోయి రాత్రి వారి తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని చెప్పారు. వారు శుక్రవారం పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంతో మృతదేహాల కోసం చెరువులో గాలించి మరణించిన ఇద్దరి మృత దేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.