రంగారెడ్డి

పద్మానగర్ సాయిబాబా ఆలయంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 27: పద్మానగర్‌లోని సాయిబాబా ఆలయంలో దొంగలు చొరబడి సుమారు రూ.3 లక్షల విలువ చేసే సొత్తును అపహరించిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పద్మానగర్ రింగ్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును, వెండి పాత్రలు, ఆభరణాలు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.2 నుండి రూ.3 లక్షల వరకు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నమూనాలను సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, పేట్‌బషీరాబాద్ ఎసిపి శ్రీనివాస్ రావులు పరిశీలించారు. వివేక్ మాట్లాడుతూ ఆలయాల్లో దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం
పరిగి, ఫిబ్రవరి 27: పూడూరు మండలం సోమన్‌గుర్తి స్టేజీ సమీపంలో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర కాటన్ మిల్లులో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాటన్ మిల్లులో మంటలు లేవడంతో పని చేస్తున్న సిబ్బంది బయటికి పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్‌లకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విషయం తెలిసిన వెంటనే చన్‌గోమూల్ పోలీస్‌లు వెంకటేశ్వర కాటన్ మిల్లు దగ్గరికి ఎస్‌ఐ రవి, సిబ్బందితో చేరుకున్నారు. సంఘటన వివరాలను తెలుసుకున్నారు. మిల్లులలో దాదాపు 4000 వేల టన్నుల పత్తి కాలినట్లు సమాచారం. కాటన్ మిల్లులో మంటలు లేవడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ ఇదే పూడూరు మండలంలో కాటన్ మిల్లు కాలిపోయిన విషయం పాఠకులందరికి తెలిసిందే. అప్పుడు కాటన్ మిల్లులో మంటలు చెలరేగినప్పుడు అక్కడ ఉన్న వారు మంటలు అర్పుటకు ప్రయత్నం చేయలేదని ఆరోపణలున్నాయి.