రంగారెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీనలో అవినీతి, అలసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 28: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంతో పాటు క్లియరెన్స్ ఇవ్వటంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధికారుల అవినీతి, అలసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం వర్తింపజేస్తున్న నాలా టాక్స్‌ను వెంటనే రద్దు చేయటంతో పాటు అధికారులు అవినీతిని మానుకోవాలని నినాదాలు చేస్తూ హైదరాబాద్ జిందాబాద్, ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్‌మెంట్స్, కాలనీస్ సంయుక్త్ధ్వార్యంలో మంగళవారం హెచ్‌ఎండిఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) పేరుతో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి సంవత్సరం పూర్తయిందని చెప్పారు. వచ్చిన లక్షా ఆరవై వేల దరఖాస్తులను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని జీవో ప్రకటించిందని అన్నారు. ఆగస్టు 30 నాటికి అన్ని దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉండగా, సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడేందుకే అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తులను లంచాలు తీసుకుని దొడ్డిదారిన పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దరఖాస్తుల పరిశీలనలో అవినీతి జరుగుతుందని, దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసి త్వరగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాన్ అగ్రికల్చర్ లాండ్ అసైన్‌మెంట్ టాక్స్‌ను మూడు శాతం చెల్లించాలని జీవోలో స్పష్టంగా ఉండగా అధికారులు రకరకాల పేర్లతో 4.5శాతం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను వదిలేసి ప్లాట్లను కొనుగోలు చేసిన పేద, మధ్య తరగతి ప్రజలపై నాలా టాక్స్‌ను వసూలు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులును హైదరాబాద్ జిందాబాద్, ఫాకా అధ్యక్షుడు ఎన్.అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు బ్రహ్మచారి, శ్రీనివాస్, కుమారస్వామి, వీరయ్య, సంజీవరావు, శివప్రసాద్, నారాయణరెడ్డి, శ్రీరాములు కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రిక్రూట్ చేసి ఆరు నెలల్లో దరఖాస్తులను ఆగస్టు 31నాటికి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

అంగన్‌వాడీల జీతం పెంపుపై సిఐటియు హర్షం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు జీతాలు పెంచడం హర్షనీయమని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా శోభన్ అన్నారు. మంగళవారం చందానగర్ ప్రాంతంలోని శాంతినగర్‌లో అంగన్‌వాడీలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అంగన్‌వాడీల వీరోచిత పోరాటం ఫలించిందని, జీతాల పెంపుతో పాటు గౌరవప్రదంగా అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడి టీచర్లుగా హోదా మారుస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక నేత శోభన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కె.కృష్ణ పాల్గొన్నారు.
సిఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
అంగన్‌వాడీ టీచర్లకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిఎం కెసిఆర్ ఫ్లెక్సీకి చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పాలాభిషేకం చేశారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్‌కాలనీలో గల కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లతో కలిసి విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు తమకు జీతాలు పెంచాలని నిరసన తెలిపితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా గుర్రాలతో తొక్కిస్తే నేటి మన తెలంగాణ సిఎం కెసిఆర్ అడగకుండానే జీతాలు పెంచడం గొప్ప నిర్ణయమన్నారు.
అంగన్‌వాటీ టీచర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కూడా కట్టిస్తానని వరాలు ప్రకటించిన సిఎం కెసిఆర్ మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. ఇటీవలే ఒంటరి మహిళలకు పింఛన్లు, సర్కారు దవాఖానాల్లో ప్రసవించిన వారికి ప్యాకేజీలు ప్రకటించారని, వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని కార్పొరేటర్ నవతారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సునీతారెడ్డి, ఉమ, జక్క సులోచన, ఆశ పాల్గొన్నారు.