రంగారెడ్డి

భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 28: ఎండాకాలం వచ్చిందంటే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదాలు ప్రారంభమైనట్టే. మంగళవారం జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లి రోడ్డులో డైమండ్ ఇంక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఓ కెమికల్ గోదాముకు మంటలు వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలతో చుట్టుపక్కల పరిశ్రమల యాజమాన్యం, కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. నల్లటి పొగలతో జీడిమెట్ల ప్రాంతమంతా కమ్ముకుపోయింది. జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, మేడ్చల్ ప్రాంతాల నుండి నాలుగు ఫైరింజన్‌లు మంటలను ఆర్పుతున్నాయి. లక్షల్లో ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంతో కెమికల్ గోదాముల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్రమంగా కొనసాగించే కెమికల్ గోదాములపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని స్థానికులు వాపోతున్నారు.కెమికల్ గోదాములపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ధారూర్, ఫిబ్రవరి 28: వెనకబడిన వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇద్దరు వాలంటీర్లను నియమించి 15 నుండి 30 సంవత్సరాల వయసుగల వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. మార్చి నెలాఖరు వరకు వివరాల సేకరణ పూర్తవుతుందని ఏప్రిల్ నుండి పని ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి వారి అర్హతలకు వారికి శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతిగ్రామంలో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు మండల స్థాయి అధికారులను అదేశించామన్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల్లో కావలసిన సౌకర్యాలను సమకూరుస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 15500 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని, 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్ ఇవ్వని పక్షంలో ప్రత్యేక యాప్ ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో కూడా ప్రత్యేక యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా ఫాం పాండ్లను ఏర్పాటు చేశామని రాష్ట్రంలో 3వ స్థానంలో వికారాబాద్ జిల్లా నిలిచిందన్నారు. ఉపాధిహామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు. నిరుద్యోగుల వివరాల సేకరణ, తాగునీటి వసతి తదితర అంశాలపై ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈలు, ఎంపిడిఓలతో మార్చి 4న సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పౌరసంబంధాల అధికారి దీర్ఘ సెలవులో ఉన్నందున జిల్లా యువజన, క్రీడల జిల్లా అధికారి హన్మంతరావుకు ఇంచార్జి డిపిఆర్‌ఓగా నియమించినట్లు తెలిపారు.