రంగారెడ్డి

హాజిపల్లి, గంట్లవెల్లిని సందర్శించిన ఐఏఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, మార్చి 2: నిర్మల్ పురస్కార్, స్వచ్చ్భారత్ అవార్డులు సాధించిన గ్రామాలను ఐఎఎస్ అధికారులు సందర్శించారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి, గంట్లవెల్లి గ్రామాలను వివిధ రాష్ట్రాల కలెక్టర్లు, ట్రైనింగ్ కలెక్టర్లు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. నిర్మల్‌పురస్కార్, స్వశక్తికరణ, శుభ్రం అవార్డులు సాధించిన హాజిపల్లి గ్రామాన్ని ముందుగా సందర్శించి హర్షం వ్యక్తం చేశారు.
గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించడంతోపాటు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. హాజిపల్లిలో 100శాతం ఇంటిపన్నులు, మరుగుదొడ్ల నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయని సర్పంచ్ సింగారం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జంగమ్మను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, సిసిరోడ్లు నిర్మాణాలు వంటి విషయాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అవరణలో విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం గంట్లవెల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో 90శాతం అభివృద్ధి పనులు చేశామని, ప్రజలందరి సహకారంతోనే గంట్లవెల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు సర్పంచ్ లలితభాస్కర్ వివరించారు.
వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ఫిల్టర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న గిరిజన తండాను సందర్శించి అభివృద్ధికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ భారతి, ఝార్ఖండ్‌కు చెందిన కలెక్టర్ సనివసవాహీ, ట్రైనింగ్ కలెక్టర్లు విజయరామరాజు, ఫయాజ్ ఆహ్మద్, బోర్‌సింగ్, శశిరంజన్, విజయకుమార్, ఎన్‌ఐఆర్ సభ్యుడు విజయ్‌కుమార్, ఎంపిడివో రాజేశ్వరీ, ఇఓఆర్‌డి సాధన, ఎంపిపి బుజ్జిబాబు నాయక్, జడ్పిటిసి సభ్యురాలు అరుణగోవింద్, ఎంపిటిసి సభ్యురాలు రజిత, కృష్ణవేణి, వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు.

మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మొద్దు

షాద్‌నగర్, మార్చి 2: మాయమాటలు చెప్పే రాజకీయ పార్టీలను ఏ ఒక్కరు కూడా నమ్మవద్దని, కాంగ్రెస్ అభ్యర్థి నడికూడ భార్గవిని గెలిపించాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 10వ వార్డు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.్భర్గవితోపాటు పార్టీ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయ పార్టీల నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయమని అభ్యర్ధిస్తారని, అలాంటి వారి మాటలు ఏ ఓటరు కూడా నమ్మవద్దని సూచించారు. 10వ వార్డు ఉప ఎన్నికల్లో భాగంగా రతన్‌కాలనీ, అంజయ్య కాలనీ, అడివయ్య కాలనీ, నలమోని కాలనీ, రాంనగర్ కాలనీల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్, చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు కొంకళ్ల చెన్నయ్య, రాజేందర్‌రెడ్డి, మహమూదాభేగం, కాంగ్రెస్ నాయకులు వన్నాడ ప్రకాష్‌గౌడ్, ఒగ్గు కిశోర్, మధు, దంగు శ్రీనివాస్ యాదవ్, అప్పి, సుదర్శన్‌గౌడ్, కృష్ణ పాల్గొన్నారు.