రంగారెడ్డి

బోధనా పద్ధతులు ఆధునిక సాంకేతికను సంతరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 2: బోధనా పద్దతులు ఆధునిక సాంకేతికను సంతరించుకోవాలని ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా సంచాలకుడు డాక్టర్ డిఎన్ రెడ్డి అన్నారు. బాచుపల్లినో విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గురువారం ‘కన్వర్జెన్సీ 2కె17’ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి డిఎన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగం పురస్కారాలను అందజేశారు. సావనీర్‌ను విడుదల చేశారు. డిఎన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 28 ప్రొఫెషనల్ సొసైటీలు విద్యార్థుల ఎదుగుదలలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. ఐఎస్‌టిఇ కూడా అంకిత భావంతో కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 700కుపైగా విశ్వవిద్యాలయాలలు ఉండగా అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలలో వేల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. మనదేశంలో అఫిలియేషన్ పొందిన కళాశాలలు ఎక్కువగా ఉన్నందున విద్యాప్రమాణాలను మెరుగుపరిచే బాధ్యత విశ్వవిద్యాలయాలదే అవుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం తరగతి గదుల్లో బోధించటమేకాక పరిశోధనల్లో పాలుపంచుకోవాలని అధ్యాపకులకు ఉద్భోదించారు. విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ఉండవలసిన పది గుణాల గురించి ఆహుతులకు వివరించారు. జెఎన్‌టియు వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బోధన, పరిశోధనలకు సంబంధించి విఎన్‌ఆర్ విజెఐఇటిలో ఉన్న ఎన్నో మంచి అవకాశాలలను ప్రశంసించారు. ఇంజనీరింగ్ కళాశాలలు లాభదాయకమైన ఉత్పత్తులను రూపొందించే దిశగా కృషి చేయాలని, ఈ కళాశాలలో ఉన్న ఇన్‌క్యుబేషన్ సెంటరర్ ఈ దిశగా చక్కని ప్రతిభను వెలికితీస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యాప్రమాణాలు నిరాశను కలిగిస్తున్నాయని, అన్ని కళాశాలల్లోనూ సృజనాత్మక బోధనా పద్ధతులు, అనునిత్యం తమను తాము మెరుగుపరుచుకునే తత్వమున్న ఉపాధ్యాయులు ఉండటం అవసరమని ఆకాంక్షించారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా త్వరలో ఉపాధ్యాయుల అభివృద్ధికి ఆన్‌లైన్ కోర్సులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీవనసాఫల్య పురస్కార గ్రహీత పంధరి పాండే, ఐఎస్‌టిఇ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగాలకు చెందిన చైర్‌పర్సన్‌లు డాక్టర్ లాల్‌కిషోర్, వేణుగోపాల్‌రెడ్డి, హేమచంద్రారెడ్డి, పద్మశాయి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిడి నాయుడు, విజ్ఞాన్ జ్యోతి సొసైటీ కార్యదర్శి బి.శరత్‌గోపాల్, అధ్యక్షులు డిఎన్ రావు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో 1809 మంది ఓటర్లు

వికారాబాద్, మార్చి 2: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడి ఎన్నికకు వికారాబాద్ జిల్లాలో 1809 ఓటర్లున్నారని జిల్లా రెవిన్యూ అధికారి జి.సంధ్యారాణి వెల్లడించారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 18 మండలాల్లోని అన్ని జిల్లాపరిషత్ పాఠశాల్లో తొమ్మిదో తేదీన నిర్వహించే పోలింగ్‌కు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కోట్‌పల్లి మండలంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని, జిల్లా కేంద్రంలో రెండు పోలింగ్ కేంద్రాలుంటాయని తెలిపారు. పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ నిర్వహణకు 80 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకావడం మూలాన ఉపాధ్యాయులు కాకుండా ఇతర శాఖల ఉద్యోగులను ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్లుగా నియమించినట్లు స్పష్టం చేశారు. 100వరకు ఓటర్లున్న చోట ఒక ప్రిసైడింగ్, ఒక పోలింగ్‌అధికారి, అంతకు మించి ఉన్నచోట ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ అధికారులను నియమిస్తున్నట్టు వివరించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నామని, బ్యాలెట్ పేపర్‌పైన 12 మంది అభ్యర్థులుంటారని అందులో అంకెలు మాత్రమే వేయాలని, వేలిముద్రలు, పదాలు రాసినా చెల్లబోదని స్పష్టం చేశారు. పోలింగ్ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ, ఐదు రూట్లుగా విభజించి పంపనున్నామని, 15న హైదరాబాద్ విక్టరీ మైదానంలో ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం కోసం జిల్లాలో సర్వే చేస్తున్నామని అన్నారు. యాదవ కుటుంబాలకు మేకలు, చేనేత కార్మికులకు గొర్రెలు ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తున్నామని వివరించారు.