రంగారెడ్డి

రియాద్ జైలులో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, మార్చి 2: బతుకుదెరువు కోసం బయటి దేశానికి వెళ్లిన ఓ గిరిజన యువకుడు సౌదిలోని రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తూ బాత్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగి రెండు రోజులు అయిన తరువాత ఆలస్యంగా సమాచారం రావడంతో ఆ తండా తల్లడిల్లి పోయంది. తండా అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాకు చెందిన ఉడిత గోవింద్‌నాయక్ మణిబాయ్‌ల మూడవ కుమారుడు ఉడ్తి శ్రీనివాస్ (28) మూడుసంవత్సరాల క్రితం బతుకుదెరువుకోసం సౌదిలోని రియాద్‌లో పనిచేసేందుకు వెళ్లాడు. వారంరోజుల క్రితం డ్రైవింగ్ చేస్తూ ఓ యాక్సిడెంట్ చేయగా అక్కడి కోర్టు శ్రీనివాస్‌కు పది రోజుల జైలుశిక్ష, మూడువేల రూపాయల జరిమానా విధించింది. అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తూ రెండురోజుల క్రితం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి బంధువులకు గురువారం ఉదయం సమాచారం అందింది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలియడంతో తాండవాసులు పెద్ద ఎత్తున మృతుడి ఇంటికి చేరుకుని గోవింద్‌నాయక్, మణిబాయ్‌లను ఓదార్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకువచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నారు.

కమ్యూనిస్టుల శాంతి వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వికారాబాద్, మార్చి 2: శాంతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాగృత భారత్ ప్రాంత ప్రముఖ్, ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద జాగృత భారత్ ఆద్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2025లో భారతదేశానికి అద్వితీయ స్థితి వస్తుందని చెప్పారు. దురదృష్టవశాత్తు 1920లో విదేశీ భావాజాలం దేశంలోకి ప్రవేశించిందని, 1926లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైందని తెలిపారు. 1952లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తామని చెప్పుకుని నామరూపాల్లేకుండా పోయారని గుర్తుచేశారు. ప్రస్తుతం చైనాలో కమ్యూనిస్టులు తగ్గి, పెట్టుబడిదారులే వ్యవహారం నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిందని, మిగిలింది కేరళలోనేనని అన్నారు. కేరళలో వ్యవసాయం మానేశారు, పరిశ్రమలు లేవని, పాఠశాలు నేర్చుకోవాల్సిన కమ్యూనిస్టులు గుడ్డిగా వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టుల అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు, ఒకపుడు కాంగ్రెస్‌కు ఆర్‌ఎస్‌ఎస్ అండగా నిలిచిందని, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతోనే కాంగ్రెస్ సభ నిర్వహించిందని వివరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. కేరళలో సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలను ప్రజల ద్వారానే ఎదుర్కోవాలని సూచించారు. ధర్మాన్ని నిలబెట్టే బలం హిందవుల వద్ద ఉన్నందుకే ఇతరులు భయపడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రపంచంలో విజయం ఆర్‌ఎస్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. మరింత సమయాన్ని వెచ్చిస్తే సంఘ్ చేపట్టే పథకాల్లో పాలుపంచుకోవచ్చని సూచించారు. సమాజలంలో నాయకత్వాన్ని నిలబెట్టాలని కోరారు.
కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చౌదరి యాదవరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అందజేసిన వినతిపత్రంలో కేరళలో జాతీయ వాదులపై కమ్యూనిస్టులు దాడికి పాల్పడ్డారని, హత్యలు చేస్తున్నారని దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బైక్ ర్యాలీ
ధర్నా అనంతరం జనజాగృతి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు బిజెఆర్, ఎంఆర్‌పి, డైట్‌రోడ్ మీదుగా పాత శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాలకు చేరుకున్నారు. అంతకుముందు ధర్నాకు తాండూరు, బొంరాస్‌పేట నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.