రంగారెడ్డి

కంటోనె్మంట్‌లో భూ ఆక్రమణ చేస్తే ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మార్చి 3: దేశంలోని కంటోనె్మంట్, రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలను ఆక్రమించినట్టు రుజువైతే వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుండి తొలగింపుతోపాటు వారికి ఉన్న స్థిరాస్తిని స్వాధీన పరుచుకోవడానికి నూతనంగా చట్టం రాబోతున్నట్టు కంటోనె్మంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్‌విఆర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కంటోనె్మంట్ బోర్డు అధ్యక్షుడు అజయ్‌సింగ్ నేగి ఆధ్వర్యంలో జరిగిన బోర్డు పాలకమండలి సమావేశంలో అనేక అంశాలను చర్చించి ఆమోదించారు. అయితే ప్రధానంగా దేశంలోని 62 కంటోనె్మంట్ బోర్డు పరిధిలో రక్షణ శాఖ, కంటోనె్మంట్ పరిధిలోని స్థలాలు భూకబ్జాలకు గురికావడంతో అనేక కేసులను అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రక్షణ శాఖ కంటోనె్మంట్ భూములను స్థానికులు ఆక్రమించినట్లు రుజువైతే వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఆక్రమణ కాకుండా ఆ వ్యక్తి స్థిరాస్తిని కూడా స్వాధీన పరచుకోవడానికి చట్టాన్ని రూపొందిస్తున్నారు. అయితే దీనిలో మళ్లీ న్యాయపరమైన ఇబ్బందులు అవకాశం ఉన్నందున ఆక్రమదారుల పేర్లను ఓటర్ల జాబితాలో నుండి తొలగించడానికి కంటోనె్మంట్ బోర్డు పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిద్వారా కంటోనె్మంట్ పరిధిలోని భూ ఆక్రమణదారులను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు బొల్లారంలో ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన జనరల్ ఆసుపత్రిలో వైద్యసేవలకు చార్జీలను వసూలు చేయాలన ప్రతిపాదలను సిద్ధం చేశారు. కానీ, వారికి ప్రతిపాదనను బొల్లారం ప్రాంత కంటోనె్మంట్ బోర్డు సభ్యులు లోక్‌నాథం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే వైద్య సౌకర్యాలు ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చి వాటికి నామమాత్రపు చార్జీలను నిర్ణయించాలని, దీనిపై ఒక కమిటీని ఏర్పాటుచేసి కమిటీ సూచనలమేరకు నడుచుకోవాలని ప్రతిపాదించారు. ఆయన సూచనలను బోర్డు, పాలక మండలి ఆమోదించింది. ప్రధానంగా కంటోనె్మంట్‌లో సమస్యగా మారిన చెత్త తొలగింపు అంశం చర్చనీయాంశంగా మారింది. కంటోనె్మంట్ ప్రాంతంలోని బోయినపల్లి, బేగంపేట, మారేడపల్లి, కార్కానా, తిరుమలగిరి ప్రాంతంలోని చెత్తను ప్రతిరోజూ తిరుమలగిరి గాంధీ కమ్యూనిటీ హాలు పక్కనే వేయటంతో రహదారిపైన దుర్వాసన వెదజల్లుతూ ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోందని తిరుమలగిరి ప్రాంత బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పాలక మండలి సమావేశంలో ఏ వార్డులోని చెత్తను అదే వార్డులో వేసి అక్కడి నుండి డంపింగ్ యార్డుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు మాసాలు దాటినా ఈ నిర్ణయం అమలు కావటం లేదని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి స్పందించిన అధికారులు తుర్కపల్లి, బొల్లారంలో ఉన్న కంటోనె్మంట్ చెత్త డంపింగ్ సెంటర్‌లో చెత్తవేయటాన్ని అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో సమస్యగా మారిందని, అల్వాల్ ప్రాంతంలోని ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే కనకారెడ్డి అభ్యంతరం చెబుతున్న కారణంగా చెత్త అక్కడ వేయలేకపోతున్నామని వివరించారు. ఈ అంశంలో బోర్డు సభ్యులు కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, ఎంపి మల్లారెడ్డి చొరవ తీసుకుని బొల్లారంలోని డంపింగ్ యార్డులో చెత్త వేయటానికి అందుబాటులోకి తీసుకురావాలని చర్చలు జరపాలని కోరారు. కార్యక్రమంలో కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, బోర్డు సభ్యులు మిలిటరీ నామినేటెడ్ అధికారులు హాజరయ్యారు. కంటోనె్మంట్ బోర్డు నూతన అధ్యక్షునిగా నియమితులైన అజయ్ మాలిక్ సమావేశంలో హాజరై బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న కల్నల్ అజయ్‌సింగ్ నేగి సికిందరాబాద్ నుండి నార్త్‌ఈస్ట్ సర్కిల్‌కు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా కంటోనె్మంట్ బోర్డు ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న
బస్సులపై దాడులు చేసిన ఆర్టీఏ
రాజేంద్రనగర్, మార్చి 3: నిబంధనలకు విరుద్ధంగా నడస్తున్న బస్సులపై ఆర్టీ ఏ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు చేశారు. దాడుల్లో 19 బస్సులపై కేసు నమోదు చేయగా, ఒక బస్సును సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటివల జరుగుతున్న ప్రైవేట్ బస్సుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీఏ అధికారులు సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆర్టీ ఏ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 19 బస్సులపై కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు. ఇంకా ఒక బస్సును సీజ్ చేశామని తెలిపారు. ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ యాజమాన్యాలు బస్సులను నడిపిస్తే సహించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు, ఫిట్‌నెస్ సరిగా ఉండాలన్నారు. లేకపోతే చట్టరీత్యా కేసులు నమోదు చేసి బస్సులను సీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.