రంగారెడ్డి

నగరానికి చేరుకున్న గల్ఫ్ బాధితురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, మార్చి 13: విదేశాల్లో ఉద్యోగమంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాందించాలనుకుని ఆశతో అక్కడికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్న ఓ బాధితురాలు ఎట్టకేలకు నగరానికి చేరుకుంది. పాతబస్తీకి చెందిన పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గల్ఫ్‌లో జీతం సరిగ్గా అందక, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 45ఏళ్ల మహిళ నగరానికి చేరుకోవడంతో ఆమె కూతురు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా దక్షిణ మండలం పోలీసులు దృష్టి సారించడంతో గల్ఫ్ భాదితురాలను రప్పించడంలో సఫలీకృతులయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భవానినగర్ పోలీస్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట నషామాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఖైరున్ బీ(45) గల్ఫ్‌లో ఉద్యోగం కోసం (ఇంటి పనిమనిషి) వెళ్లింది. శాలిబండ ప్రాంతానికి చెందిన ట్రావెల్ ఏజెంట్ మహ్మద్ మూసాను సంప్రదించింది. ఏజెంట్ మూసా ముంబయిలోని ఫ్లైవెల్ ఏజెన్సీ సహాయంతో ఆమెను గత డిసెంబర్ 14వ తేదీన దుబాయ్ నుండి రియాద్‌కు పంపించాడు. రియాద్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ మూడు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంటి యాజమాని సకాలంలో జీతం ఇవ్వకుండా అనేక రకాలుగా వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంటి యాజమాని డ్రైవర్ సహాయంతో హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న తన కూతురు హమీదాబేగంకు ఫోన్ చేసి అన్ని విషయాలను క్లుప్తంగా వివరించింది. హమీదాబేగం ఈనెల 1వ తేదీన దక్షిణ మండలం డసిపి వి.సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేసింది. రియాద్‌లో ఉన్న తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, ఆమెను ఎలాగైన ఇండియాకు రప్పించాలని డిసిపికి మొరపెట్టుకుంది. కేసు దర్యాప్తు చేపట్టిన భవాని నగర్ పోలీసులు శాలిబండాలోని ట్రావెల్ ఏజెంట్ మహ్మద్ మూసాకు పది రోజులలో ఖైరూన్‌బీ ఆచూకీ సంబంధించి పూర్తి వివరాలు తెలుపాలని నోటీసులు జారీ చేశారు. ట్రావెల్ ఏజెంట్ పోలీసుల సహాకారంతో ముంబాయిలోని ఫ్లైవెల్ ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో సంప్రదింపులు జరిపారు. రియాద్‌లో ట్రావెల్ ఏజెన్సీతో సంప్రదించి ఖైరూన్‌బీతో మాట్లాడి ఆమెకు ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి వారంరోజులలోపే హైదరాబాద్‌కు రప్పించారు. తల్లి, కూతురు కలిసి డిసిపి సత్యనారాయణను కలిసి కృత్ఞతలు తెలిపారు. కేసును అతి చాకచక్యంగా ఛేదించిన భవానీనగర్ పోలీసులను డిసిపి సత్యనారాయణ అభినందించారు.

ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలి
కీసర, మార్చి 13: జిల్లాలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా అధికారులు తీర్చిదిద్దాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు మండలాల్లోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు దత్తత తీసుకున్న గ్రామాలు కాకుండా, వేరే గ్రామాలను దత్తత తీసుకొని వివిధ శాఖల ద్వారా అమలౌతున్న అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వివిధ శాఖల ద్వారా సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన పురోగతి వివరాలు సిపీకి అందచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు కార్యక్రమాలతో పాటు, సంక్షేమ విద్య, వైద్యానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించేందుకు వివరాలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి భానుప్రకాశ్‌కు సూచించారు. దిన పత్రికలలో వచ్చే ప్రతి కధనానికి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నోటీసులు జారీ చేయాలని వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన వివిధ ఫిర్యాదులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 32 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గ్రామపంచాయితీ నుండి అనుమతులు లేకుండా సర్పంచ్ మల్లేశ్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కీసర మండలం, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. రాంపల్లి దాయరలోని ప్రభుత్వ భూమిలో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసున్న సర్పంచ్ మల్లేశ్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప్పల్ మండలం, నాచారం ప్రాంతానికి చెందిన శ్రుతి పుట్టుకతోనే ఎనభైశాతం మానసిక వికలాంగురాలైనందున చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వారిది పేద కుటుంబం అయినందున శ్రుతితో పాటు ఆమె వెంట వెళ్లేందుకు తల్లికి ఉచిత బస్‌పాస్ అందజేయాలని నాచారం డివిజన్ కార్పోరేటర్ శేఖర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. కాలువల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన తమకు పది సంవత్సరాలు గడుస్తున్నా, అధికారులు నష్టపరిహారం చెల్లించేదని ఘట్‌కేసర్ మండలం, మాదారం గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు రకరకాల కారణాలు చెబుతూ, కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇళ్లు, ఫింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ రుణాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు పాల్గొన్నారు.