రంగారెడ్డి

పగిలిన పైపులైన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 16: గండిమైసమ్మ దుండిగల్ మండల పరిధిలోని దుండిగల్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి తాగునీరంతా రోడ్డుపాలైంది. దుండిగల్ గ్రామ కమాన్ నుండి శంబీపూర్‌కు వెళ్లే ఇండస్ట్రియల్ రోడ్డులో గల ప్రధాన పైపులైన్ పగిలి గోదావరి జలాలు కాస్త నేలపాలయ్యాయి. గురువారం కొన్ని గంటల పాటు తాగునీరంతా పైపులైన్ నుండి వృథాగా రోడ్డు పై ప్రవహించాయి. ఇదేరకంగా ప్రధాన పైపులైన్‌లు పగిలి గంటల తరబడి నీరు నేలపాలైతే ఇక ప్రభుత్వం చేస్తున్న భగీరథ కార్యక్రమానికి అర్థం లేకుండా పోతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పగిలిన పైపులైన్‌ను వెంటనే మరమ్మతు చేసి విలువైన నీటిని వృథాగా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మార్చి నెలాఖరునాటికి
మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి
కీసర, మార్చి 16: మార్చి నెలాఖరు నాటికి జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మిషన్ భగీరధ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రోడ్లపై తవ్విన గుంతలను వెంటనే యథావిధిగా రోడ్లు ఉండేలా మరమ్మతులు చేయాలని తెలిపారు. చెడిపోయిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, కార్యచరణ ప్రణాళికలు సమర్పించాలని ఆదేశించారు. ఒఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలతో పాటు, ఒఆర్‌ఆర్ బయటి గ్రామాలలో తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీనిపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డబ్లుఎస్ ఇఇ వెంకటస్వామి, డిపిఓ సురేశ్‌మోహన్, డిఎంహెచ్‌ఒ భానుప్రకాశ్ పాల్గొన్నారు.
భగీరథ పనుల తనిఖీ
పరిగి, మార్చి 16: మిషన్ భగీరథ పనులు జూన్ నెల చివరి వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం పరిగి మండలం జాఫర్‌పల్లి గ్రామ సివారులో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో నాణ్యత లోపించకూడదని హెచ్చరించారు.
పనిలో ఏమాత్రం నాణ్యత తగ్గిన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పనులు వేగవంతం చేయాలని.. ఎక్కడా పెండింగ్ పెట్టకూడదని జూన్ నెల చివరి వారంలోపు పూర్తి కావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పరిగి తహశీల్దార్ అభిద్ అలీ, సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

ఎటిఎంలలో డబ్బుల కొరత

ఇబ్బందుల్లో వినియోగదారులు
క్యూలో వున్నా దొరకని డబ్బులు
షాద్‌నగర్, మార్చి 16: ఎటిఎంలలో డబ్బుల కొరత ఏర్పడుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఏటిఎంలలో ఎపుడు వినియోగదారులకు సరిపడే డబ్బులను నిల్వ చేస్తుండకపోవడంతో అవస్థలు పడుతున్నారు. షాద్‌నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండలాలలోని ఎటిఎంలలో చాలా మటుకు డబ్బులు లేకపోవడంతో వినియోగదారులు పరేషానవుతున్నారు. డబ్బుల కోసం ఏటిఎంల వద్దకు వెళ్లిన వినియోగదారులకు నోక్యాష్, అవుటాఫ్ సర్వీసు బోర్డులు దర్శనమిస్తుండటంతో సంబంధిత బ్యాంకుల వద్దకు వెళ్లి అధికారులను అడిగినా డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు.
ఎటిఎంలలో డబ్బులు ఎపుడు ఉంటాయో ఎపుడు ఉండవో తెలియని అయోమయ పరిస్థితులలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూలో ఉన్నా చివరకొచ్చేవరకు డబ్బులు దొరకక ఖాళీ చేతులతో వెనుదిరుగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం పనులు మానుకుని బ్యాంకుల వద్దకు వెళ్లి డబ్బులు తీసుంటున్నామని చెబుతున్నారు. నవంబర్ నుంచి ప్రారంభమైన నగదు కొరత ఐదు నెలలు గడిచినా తీరడం లేదని, డబ్బుల కోసం కాళ్లరిగేలా ఏటిఎంల చుట్టు తిరిగినా ఫలితం ఉండటం లేదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.