రంగారెడ్డి

ఆలిండియా ఇంటర్ రైల్వే పురుషుల హాకీ చాంప్ దక్షిణ మధ్య రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, మార్చి 21: ఆలిండియా పురుషుల హాకీ చాంపియన్‌షిప్ ట్రోఫీని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) జట్టు కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంలో నిర్వహించిన 75వ ఆలిండియా ఇంటర్ రైల్వే పురుషుల హాకీ చాంపియన్‌షిప్ లీగ్ స్టేజ్‌లో ఎస్‌సిఆర్ జట్టు పూల్ టాప్‌లో నిలిచి నాకౌట్ స్టేజీకి ఆర్హత పొందింది.
నాకౌట్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌సిఆర్ జట్టు 12-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థి రైల్ వీల్ ఫ్యాక్టరీపై విజయం సాధించింది. అదేవిధంగా నాకౌట్ స్టేజ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఎస్‌సి రైల్వే జట్టు 13-2 గోల్స్ తేడాతో 13-2తో డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌పై, 8-0తో సౌత్ వెస్ట్రన్ రైల్వేపై విజయం సాధించింది క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. దీంతో నాకౌట్ స్టేజీ పోటీలు ముగిశాయి. అనంతరం గౌహతిలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌సిఆర్ జట్టు 7-0తో సౌత్ ఈస్ట్రన్ రైల్వేపై విజయం సాధించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌సిఆర్ 1-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థి వెస్ట్రన్ రైల్వేపై గెలుపొంది ఫైనల్‌కు దుసుకెళ్లింది. ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌సిఆర్ జట్టు 4-1 గోల్స్ తేడాతో రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్)పై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ట్రోఫీని సాధించిన ఎస్‌సిఆర్ జట్టును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే జట్టులో జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొన్న జూనియర్ ఇండియన్ హాకీ జట్టు సభ్యుడు అజీత్ కుమార్ పాండేతో పాటు భారత రైల్వే హాకీ జట్టుకు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో ఎనిమిది మంది ఎస్‌సిఆర్ జట్టు క్రీడాకారులు కూడా ఉన్నారు. జూనియర్ వరల్డ్ హాకీ కప్‌లో పాల్గొన్న క్రీడాకారుడు అజీత్ కుమార్ యాదవ్‌తో పాటు భారత రైల్వే హాకీ జట్టుకు ఎంపికైన మరో ఎనిమిది మందిని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అభినందించారు.

మత పరమైన రిజర్వేషన్లు వద్దు
కీసర, మార్చి 21: మత పరమైన రిజర్వేషన్లను ఇచ్చే ప్రతిపాదనలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం బిజెవైఎం ఆధ్వర్యంలో చీర్యాల చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
మేడ్చల్ కలెక్టరేట్‌ను కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. రామచందర్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ ప్రభుత్వం.. మతపరమైన రిజర్వేషన్లు చేయటం సిగ్గు చేటన్నారు. విద్యా, ఉపాధి కల్పన కోసం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ కోసమే మతపరమైన రిజర్వేషన్లను కేసిఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇరవై సార్లు మతపరమైన రిజర్వేషన్లును కొట్టివేసినా, కెసిఆర్‌కు బుద్ధి రావటం లేదని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందరూ సమానమేనని, అందరికీ సమానమైన హక్కులను కల్పిస్తూ అక్కున చేర్చుకుంటుంటే, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. కులాల పేరుతో బడ్జెట్, మతాల పేరుతో రిజర్వేషన్లు అంటూ ప్రజలును తప్పుత్రోవ పట్టిస్తూ లాభం పొందాలని చూస్తోందని విమర్శించారు. భాజపా ఎవరికీ వ్యతిరేకం కాదని, మిగతావారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఎంవి రెడ్డికి వినతిపత్రం అందజేసారు.
పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట
కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. భాజపా కార్యకర్తలు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసారు. అక్కడ ఉన్న పోలీసులు.. కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి కార్యకర్తలను లోనికి వెళ్లకుండా నిలవరించారు. కార్యకర్తలు అక్కడే భైఠాయించి నినాదాలు చేసారు. అప్పడే కలెక్టర్ ఎంవి రెడ్డి కార్యాలయానికి విచ్చేశారు. కేవలం కలెక్టర్‌ను మాత్రమే పోలీసులు లోనికి వెళ్లనిచ్చారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. భాజపా కార్యకర్తలను కలెక్టరేట్‌లోకి రానివ్వకుండా నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మోహన్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు కె.రజనీకాంత్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు, నాయకులు పవన్‌రెడ్డి, ఉపేందర్, రుత్విక్, సంతోష్, మహేశ్, రవీందర్, జి.తిరుమల్‌రెడ్డి, నల్ల వెంకట్‌రెడ్డి, దయాకర్, దిలీప్, కె.సత్తిరెడ్డి, దిలీప్‌రెడ్డి, సత్యనారాయణ, సురేశ్, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.