రంగారెడ్డి

మ్యూటేషన్ ఫీజు తగ్గించాలని ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 21: మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో స్థిరాస్తి కొనుగోలు సందర్భంగా విధిస్తున్న ఒక శాతం మ్యూటేషన్ ఫీజును వెంటనే తగ్గించాలని కోరుతూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో స్థలాలు, ఇళ్లు, ఇళ్లస్థలాలు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో నగర పంచాయతీకి ఒక శాతం మ్యూటేషన్ ఫీజు కింద చెల్లించాలని నిబంధనలు విధించడంతో కొనుగోలుదారులపై అదనపుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనను వెంటనే సడలించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వినతిప్రతాలు అందించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలలోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 0.5 శాతం మ్యూటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలో విధిస్తుండగా అందుకు భిన్నంగా మేడ్చల్‌లో అధికారులు తమ ఇష్టానుసారంగా మ్యూటేషన్ ఫీజును విధించి కొనుగోలుదారులను నిలువుదోపిడీ చేసున్నారని నాయకులు ఆరోపించారు. పలు విషయాలను నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డికి వివరించిన నాయకులు అనంతరం వినతిపత్రం అందజేశారు. వెంటనే మ్యూటేషన్ ఫీజును తగ్గించకుంటే నరగ పంచాయతీ కార్యాలయాన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, దాత్రిక లక్ష్మణ్, బాగిరెడ్డి, రమాకాంత్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రమేశ్, రాజు, అవినాశ్, నర్సింగ్‌రావు, హరిప్రసాద్, ఆంజనేయులు, విజయ్, యాదగిరి పాల్గొన్నారు.

ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే మతపరమైన రిజర్వేషన్లు

వికారాబాద్, మార్చి 21: ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్.. మతపరమైన రిజర్వేషన్లంటూ మోసం చేస్తున్నారని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు విమర్శించారు. మంగళవారం బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీగంజ్ నుంచి బుర్గుపల్లిలోని కలెక్టరేట్ వరకు మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. దాదాపు 150 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. మతపరమైన రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధమైనా.. కెసిఆర్ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్‌లపై ముస్లింలకూ నమ్మకం లేదని చెప్పారు. కెసిఆర్ గతంలో చెప్పివని ఏవీ కాలేదని ముస్లింలు గుర్తించారని అన్నారు. మతపరమైన రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా 2000 మందిని ఈనెల 24న ఛలో అసెంబ్లీకి జిల్లా నుండి తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో మైనారిటీ ప్రజల మెజారిటీతోనే బిజెపి అభ్యర్థులు గెలిచారని స్పష్టం చేశారు. విభజించు పాలించు నినాదంతో అమలు చేయాలనుకున్న మతపరమైన రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుందని వివరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె.శివరాజ్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు టి.సదానందరెడ్డి, జిల్లా కార్యదర్శి జి.పాండుగౌడ్, రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌యాదవ్, జగదీశ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పోకల సతీష్, నాయకులు సత్యనారాయణరెడ్డి, రాచశ్రీనివాస్‌రెడ్డి, బిజెవైఎం నాయకులు మణికంఠ, గిరీష్, అశోక్ పాల్గొన్నారు.