రంగారెడ్డి

పరీక్షా కేంద్రం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, మార్చి 21: పరీక్ష రాస్తూ కాపీ కొట్టావంటూ ఇన్విజిలేటర్ పేపర్ లాక్కోవడంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థి అదే పరీక్షా కేంద్రం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేసిన పాఠశాల నిర్వహకుడు తమకు పోటీగా ఉన్న ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థుల పట్ల కావాలనే వివక్ష చూపించడమే ఈ ఘటనకు కారణమని నిరసిస్తూ బాధితుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఈవిధంగా ఉన్నాయి. బిఎన్‌రెడ్డినగర్‌లో నివసించే భూపాల్‌రెడ్డి కుమారుడు సన్నిత్‌రెడ్డి(15) సంతోష్‌నగర్‌లోని భాష్యం స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అతనికి చంపాపేట్ యాదగిరినగర్ కాలనీలోని విద్యాదాయిని పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. సోమవారం సన్నిత్‌రెడ్డి హిందీ పరీక్ష రాస్తుండగా అతని సమీపంలో చిట్టీ దొరికిందని పాఠశాల నిర్వహకుడు అతని వద్ద నుంచి పేపర్ లాక్కున్నాడు. కానీ, తాను కాపీ కొట్టలేదని సన్నిత్‌రెడ్డి గోడకు తలబాదుకొని ఏడ్చాడు. అతన్ని పాఠశాల కార్యాలయంలో కూర్చోబెట్టగా బాత్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పి పాఠశాల మూడో అంతస్థుపైకి వెళ్లి అక్కడి నుండి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన అతన్ని డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతనికి నడుము, పక్కటెముకలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. పరీక్ష కేంద్రం వద్దకు మంగళవారం ఉదయం బాధితుడి కుటుంబ సభ్యులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లవాడు మంచిగా చదువుతాడని, ఐఐటికి సన్నద్ధం అవుతున్నాడని అతనికి కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ తమ పోటీ పాఠశాలకు చెందిన విద్యార్థులను వేధించాలని ఇలా ప్రవర్తించాడని ఆరోపించారు. పరీక్షా సమయంలో ఇక్కడ ఆందోళన వద్దని కంచన్‌బాగ్ పోలీసులు సముదాయించి వారిని అక్కడి నుండి మాట్లాడేందుకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

శేరిలింగంపల్లిలో స్థల వివాదం: ఉద్రిక్తత

శేరిలింగంపల్లి, మార్చి 21: శేరిలింగంపల్లి గ్రామంలోని ఓ స్థల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ వర్గానికి చెందిన 50మందికి పైగా అకస్మాత్తుగా వచ్చి ప్రార్థన చేశారు. ఇది తన ప్లాట్‌గా పేర్కొంటూ సంబంధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకుని ఇరు వర్గాలను వెళ్లగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామకంఠం భూమిలో కొనే్నళ్ల క్రితమే పలువురు ఇళ్లు కట్టుకున్నారు. కాగా సుమారు 250గజాల స్థలం ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా 50మందికి పైగా వచ్చి టెంట్ వేసుకుని ప్రార్థన చేశారు. దాంతో పోలీసులకు ఆ ప్లాట్ యజమానిగా పేర్కొంటున్న దేవులపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. మియాపూర్ ఎసిపి రవికుమార్ ఆధ్వర్యంలో చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ సి.హరిశ్చంద్రారెడ్డి, రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ భాస్కర్, చందానగర్ ఎస్‌ఐ పి.సైదులు, ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, సిబ్బంది భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దాదాపు 250గజాల గ్రామకంఠం భూమి ప్రభుత్వానికి చెందినదని, తాము ప్రార్ధనా మందిరం నిర్మించుకుంటామని ఆ వర్గానికి చెందిన వ్యక్తులు పట్టుబట్టడంతో కొంత సేపు గందరగోళం నెలకొంది.
పోలీసులు టెంట్ తొలగించి ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కాగా తాను 150 గజాల స్థలం కొనుగోలు చేశానని, నాలుగో వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, మొదటి యజమాని మిర్జా వాహిద్‌బేగ్ 1987సంవత్సరంలో శేరిలింగంపల్లి మున్సిపాలిటీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి కూడా తీసుకున్నారని దేవులపల్లి శ్రీనివాస్ తన డాక్యుమెంట్లను పోలీసు అధికారులకు చూపించారు.
స్థలం విక్రయించాలని కొంత కాలంగా తనపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని, ఒప్పుకోకుంటే వివాదం సృష్టిస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే చందానగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. కొంత మంది బయటి వ్యక్తులు తమ స్వార్థం కోసం ఓ పథకం ప్రకారం పలువురిని రెచ్చగొట్టి గందరగోళం సృష్టించారని లింగంపల్లి డెవలప్‌మెంట్ కమిటీ నాయకులు కచ్చర్ల ఎల్లేశ్, గోపాల్, సలీం, ఇతర నాయకులు వివరించారు. శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కెవిబి సుబ్బారావు.. స్థానిక నాయకులతో మాట్లాడి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. స్థల నిర్ధారణకు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌కు లేఖ రాశామని, ఇంకా ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఎసిపి రవికుమార్ వివరించారు. శేరిలింగంపల్లి గిర్దావర్ రాజశేఖర్, విఆర్వో సురేందర్ వచ్చి పరిశీలించారు. బుధవారం సర్వే జరిపి హద్దులు నిర్ధారిస్తామని గిర్దావర్ తెలిపారు.
పికెటింగ్ ఏర్పాటు: ఎసిపి
శేరిలింగంపల్లి గ్రామంలోని గ్రామకంఠం స్థలంలో జరిగిన వివాదంపై విచారణ జరుపుతున్నామని మియాపూర్ ఎసిపి రవికుమార్ చెప్పారు. అంతా ప్రశాంతంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని తెలిపారు.