రంగారెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ రాఘవరెడ్డి అన్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెలంగాణలో 36ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు వివరించారు. మిగితా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేయలేదని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొంటే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సిఎం కెసిఆర్ విస్మరించారని, అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని చెప్పి.. నేడు కార్యకర్తలకు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు నాలుగు దఫాలుగా చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, మిషన్ భగీరథ పథకంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని, త్వరలోనే ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, నాయకులు శీలం శ్రీను, అఖిల్, జహంగీర్, ప్రకాశ్ పాల్గొన్నారు.

కంప్యూటర్‌లో ఉచిత శిక్షణ
ఉప్పల్, మార్చి 23: టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల పాటు కంప్యూటర్‌లో బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ కానె్సప్ట్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్ తెలిపారు. గురువారం రామంతాపూర్ గాంధీనగర్, మారుతీనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేసి యువతీ యువకుల్లో అవగాహన కల్పించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్/ ఫెయిలైన 17 నుంచి 27 ఏళ్ల వయస్సులోపు యువతీ యువకులు ఉప్పల్‌లోని స్మార్ట్ సెంటర్‌లో ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 8885120066, 8885512036కు సంప్రదించాలని పేర్కొన్నారు.