రంగారెడ్డి

కూరగాయల పంటలను సమూహ పంటలుగా సాగుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 23: కూరగాయల పంటలను సమూహ పంటలుగా సాగు చేసుకోవాలని ప్రముఖ వ్యవసాయ భూసార శాస్తవ్రేత్త రాజేశ్వర్ నాయక్ సూచించారు. గురువారం స్థానిక స్ర్తిశక్తి భవనంలో పంట సమూహాల అభివృద్ధిపై రైతు శిక్షణ నిర్వహించారు. పంట సమూహాల సాగుతో తక్కువ ఖర్చు, అధిక లాభాలు వస్తాయని, సమూహ పంటలను ఎలా సాగు చేసుకోవాలో సమగ్రంగా వివరించారు. రైతు భూసార పరీక్ష చేయించుకుని భూసార పరీక్ష ఆధారిత రసాయనిక, సేంద్రీయ ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షతో నేలను నష్టపర్చకుండా నేల భూభౌతిక లక్షణాలను మెరుగుపర్చుకోవచ్చని చెప్పారు. ఎఫ్‌టిసి వ్యవసాయ అధికారిణి లావణ్య మాట్లాడుతూ పంట సమూహాలపై రైతులు అవగాహన పెంచుకుని శాస్తవ్రేత్తలు చెప్పినట్లుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అన్నారు. రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారిణి హిమబిందు మాట్లాడుతూ క్రిమిసంహారక మందులు అధికంగా వాడకుండా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని సూచించారు. వికారాబాద్ మండల వ్యవసాయ అధికారి లక్ష్మిప్రసన్న, ఎఇవో జి.పావని, ఆత్మ శైలజ పాల్గొన్నారు.

40వేల మొక్కలు నాటడమే లక్ష్యం

కీసర, మార్చి 23: ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో హరితహారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాంపల్లి దాయర గ్రామంలోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచిన అటవీ అధికారులను అభినందించారు. నర్సరీని చూసిన అనంతరం హరితహారానికి కావల్సిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం లేనప్పటికీ అధిక మొత్తంలో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటవీ, వ్యవసాయం, ఉద్యానవన, ఎక్సైజ్, మున్సిపల్ శాఖల ద్వారా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లోని శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, స్మృతి వనాలలో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కకు సపోర్టుగా కట్టెతో పాటు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరాన్ని బట్టి మొక్కలు నాటే గుంతలలో ఎర్రమట్టి వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మే 15 నాటికి గుంతల తవ్వకాన్ని పూర్తి చేయాలని తెలిపారు. పట్టణ ప్రాంత మండలాల్లో ప్రభుత్వ సంస్ధలలో, కమ్యూనిటీ భూములలో, చెరువుగట్లపై మొక్కలు నాటేందుకు ఆయా శాఖలు ప్రణాళికలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. మొక్కల సంరక్షణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలను గుర్తించాలని, ప్రధానంగా ఇంజినీరింగ్ కళాశాలలు, రాసార్ట్స్‌లు, ఫంక్షన్‌హాల్స్, వివిధ పరిశ్రమల సహకారాన్ని తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణ, మొక్కలు పెరగటానికి అవసరమైన చోట ఎర్రమట్టి వేసినట్లయితే మొక్కలు బలంగా ఎదుగుతాయని తెలిపారు. సమావేశానికి ఎక్సైజ్, నగర పంచాయితీల మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌అండ్‌బి అధికారులు హాజరు కాకపోవటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు తయారు చేయించిన ట్రీగార్డులను కలెక్టర్ పరిశీలించి ఆనందం వ్యక్తం చేసారు. డిఎఫ్‌ఓ కృష్ణ, డిఆర్‌డిఓ కౌటిల్య, డిపిఓ సురేశ్‌మోహన్ పాల్గొన్నారు.