రంగారెడ్డి

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 23: కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని అప్పుడే పార్టీ పటిష్టం అవుతుందని తెలుగుదేశం పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం చిల్కమర్రిలో తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
గ్రామీణ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టిడిపి హయాంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాయని వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత సిఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ధనార్జననే ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
గ్రామ కమిటీ
ఫరూఖ్‌నగర్ మండలం చిల్కమర్రి గ్రామంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కర్నెకోట రమేష్, కండ్లపల్లి నర్సింలు, అధ్యక్షునిగా చిన్న సాయికృష్ణయ్యను ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షునిగా కొత్తపల్లి అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అంతారం బాలయ్య, కార్యనిర్వహక కార్యదర్శిగా చాకలి పెంటయ్య, కార్యదర్శిగా కండ్లపల్లి చెన్నయ్య, కోశాధికారిగా బేగరి బాల్‌రాజ్, సభ్యులుగా లక్ష్మయ్య, కర్రె నర్సింలు, చంద్రయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, లష్కర్ నాయక్, ఎంపిటిసి సభ్యులు సురేష్‌గౌడ్, లక్ష్మీరమేష్ పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయానికి కరెంట్ కట్
తాండూరు, మార్చి 23: తాండూరు పురపాలక సంఘం భవనానికి గురువారం విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ అవపరాలకు, స్ట్రీట్ లైట్లు నిర్వాహణలకు వాడుకునే కరెంటు బిల్లులు చెల్లింపులో జాప్యం అయినందున కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేసిట్లు తాండూరు ట్రాన్స్‌కో పట్టణ ఎఇ శివశంకర్ వెల్లడించారు. కాగా మున్సిపాలిటీలో దాదాపు రూ.కోటి 7లక్షల కరెంటు బిల్లులు మార్చి నెల వరకు బకాయి ఉన్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మున్సిపల్ అధికార యంత్రాంగం.. విద్యుత్ శాఖ ట్రాన్స్‌కోకు తమ కరెంటు బిల్లుల బకాయిలకు సంబంధించి రూ.16లక్షలు చెల్లించినట్లు, వచ్చే ఏప్రిల్ మాసం చివరి నాటికి మరో రూ.24 లక్షలు, పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో కార్యాలయానికి విద్యుత్‌ను పునరుద్దరించారు.
మున్సిపల్ అధికార యంత్రాంగం, గత పాలకవర్గం నిర్లక్ష్య ధోరణులతో కరెంటు కట్ చేసే పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. మున్సిపల్ ఆదాయం.. పన్నుల వసూళ్లు కుంటుపడటంతోపాటు ప్రభుత్వ పరంగా అందాల్సిన నిధులు, గ్రాంట్స్ సక్రమంగా అందకపోవడంతో మున్సిపల్ సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తాండూరు మున్సిపాలిటీ పురోభివృద్ధికి పాలకుల హామీలు, శుష్క వాగ్ధానాలు తప్ప ఎలాంటి అభివృద్ధిపరమైన నిధుల కేటాయింపులు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.