రంగారెడ్డి

పరిసరాల పరిశుభ్రతలో ఆదర్శంగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 23: ప్రతి మహిళ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ బట్టలతో కుట్టిన సంచులను వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటికి నాలుగైదు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీరు వృథా పోకుండా అందులో ఇంకే విధంగా చూడాలని స్పష్టం చేశారు.
భూగర్భ జలాలు పెంపొందేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటికి కచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలని వివరించారు. జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై లక్ష్యాలను నెరవేర్చే విధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. స్ర్తి నిధి, స్వయం సహాయక సంఘాల నుండి రుణాలు తీసుకుని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిచారు. హరితహారం కింద జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామనీ.. ఈమేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇందులో మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ముగుదొడ్లు, హరితహారం, ప్లాస్టిక్ నిషేధం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేకుంటామని మహిళా సంఘాల సభ్యులచే చైర్‌పర్సన్, కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. స్ర్తి నిధి బ్యాంకు నుంచి ఎక్కువ రుణాలను అందజేసి మొదటి స్థానంలో ఉన్న మర్మల్లి మండల మహిళా సమాఖ్య ఎపిఎం మధుకర్, ద్వితీయ స్థానంలో ఉన్న పరిగి ఎపిఎం శ్రీనివాస్ రెడ్డిలను మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డిఆర్‌డివో జాన్సన్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందిర, స్ర్తినిధి బ్యాంకు మేనేజర్ గంగాధర్, మండల మహిళా సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా అవసరాలకు భూములు కేటాయించాలి
కీసర, మార్చి 23: ప్రజల అవసరాలకు ఉపయోగపడే సంస్థలకు భూములు కేటాయించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, పశువైద్యశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జిల్లా ఏరియా ఆసుపత్రులు, ఉద్యానవన రైతుబజారులు, రవాణాశాఖ కార్యాలయం, రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్, ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లు, శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాలు తదితర సంస్థలకు భూకేటాయింపులు చేయాలని కోరారు. సంక్షేమ శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఆర్‌డిఓలు, తహశీల్దార్‌లతో సమన్వయం చేసుకొని స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. తహశీల్ కార్యాలయ భవనాలకు మరమ్మతులు చేపట్టి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఏ చిన్న సంఘటన జరిగినా, వెంటనే స్పందించాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తహశీల్దార్‌లు తక్షణమే స్పందించాలని కోరారు. టిఎస్ ఐపాస్ కింద వచ్చిన ధరఖాస్తులను మూడు రోజుల్లో పరిష్కరించి పంపాలని అన్నారు. జివో 58, 59 కింద వచ్చిన దరఖాస్తులను 15రోజుల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. విఎఓ, విఆర్‌ఎలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిచేందుకు చర్యలు చేపట్టాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. మీ-సేవలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అత్యాచార ఘటనలు, ఆపద్బంధు పథకాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వివరించారు. జెసి ధర్మారెడ్డి, డిఆర్‌వో సురేందర్‌రావు, ఆర్‌డివోలు హన్మంత్‌రెడ్డి, మధుసూధన్, లాఅధికారి సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.