రంగారెడ్డి

కార్యాలయంలోనే రైతుల కునుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మార్చి 25: అధికారులు సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్దనే నిద్రపోవాల్సి వస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇద్దరు రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిద్రపోవడం కనిపించింది. జిల్లేడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామ పంచాయతీ పీర్జాపూర్ గ్రామానికి చెందిన బలరాం, శ్రీనివాస్ అనే ఇద్దరు రైతులు కుల, ఆదాయం సర్ట్ఫికెట్ల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ఎవరూ లేకపోవడంతో చేసేది ఏమి లేక అక్కడే కునుకు తీశారు. ఎందుకు నిద్రపోతున్నారని అడిగితే సర్ట్ఫికెట్లు ఇచ్చే అధికారులు రాలేరని, వచ్చేవరకు బయట వేచి ఉండాలని మిగతా అధికారులు చెప్పారని రైతులు తెలిపారు. దీంతో గ్రామానికి వెళ్లలేక కార్యాలయం ఆవరణలో నిద్రపోవాల్సి వచ్చిందని వివరించారు. సర్ట్ఫికెట్లు త్వరగా ఇవ్వాలని అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షల బాధ్యత వల్లే ఆలస్యం
పదవ తరగతి పరీక్షల్లో విధులు నిర్వహించడం వల్లే కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నట్లు జిల్లేడు చౌదరిగూడ తహశీల్దార్ తేన్మొలి వివరించారు. ఎగ్జామ్ డ్యూటీ లేకపోతే త్వరగా వచ్చేవారమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత సర్ట్ఫికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.
బాల్య వివాహాలను
ప్రోత్సహిస్తే చర్యలు
ధారూర్, మార్చి 25: బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో పురోహితులు, ఫొటోగ్రాఫర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురోహితులు చిన్నతనంలో వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే వీరిపై చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా ప్రోత్సహించినట్లు తెలిసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమాన, జైలు శిక్ష విధిస్తామన్నారు. ఫొటోగ్రాఫర్లు కూడా బాల్య వివాహాలలో ఫోటో గ్రాఫర్లు తీస్తే వారిపైనా చర్యలు తప్పవని, వారి దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ సభ్యులు సంజమ్మ, రామేశ్వర్, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.