రంగారెడ్డి

ఐటి నోటీసుల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 25: బినామీ డిపాజిట్ల ఖాతాలకు చెందిన వారిపై ఆదాయ పన్ను శాఖ అధికారుల బృందాలు షాద్‌నగర్ ప్రాంతంలోని వ్యాపారులపై ఆకస్మికంగా దాదాపు 19మందిపై దాడులు నిర్వహించి 26మందికి నోటీసులు జారీ చేశారని ద్వారా తెలిసింది. ఈ ప్రాంతంలో 500, వెయ్య రూపాయల పాతనోట్ల రద్దు సమయంలో ప్రభుత్వం ట్రాన్స్‌కో బిల్లులు, పురపాలక సంఘం పన్నులు, పెట్రోల్ బంక్, వైన్స్, వైద్యశాలలు, వ్యాపారులకు పాతనోట్లు నవంబర్ నెలలో తీసుకొని బ్యాంకుల్లో జమచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడలింపు ఇచ్చింది. ఇందుకు ఆధారంగా తమతమ వద్ద రోజూ వచ్చిన పాతనోట్లను బ్యాంకులో జమచేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. దీనిని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆదాయం పన్నుశాఖ అధికారులు జరిపిన సర్వేలో తేలిందని, అందువల్ల భారీ ఎత్తున ఈ ప్రాంతంలో అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు.
ఒక వైన్స్ షాపులో ప్రభుత్వం నుండి నెల వరకు 50 లక్షల రూపాయల మద్యం సరుకులు తీసుకొని విక్రయించడానికి, అదే వ్యాపారి బ్యాంకులో కోటి రూపాయల వరకు పాతనోట్లు డిపాజిట్ చేశారని తేలిందని, మరోవైన్స్ షాపులో నెలలో 25లక్షల రూపాయలు మద్యం ఖరీదు చేశాడని, దాదాపు 60లక్షల రూపాయలను పాతనోట్లను డిపాజిట్ చేశారని, ఇలాగే, పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలు రికార్డుల ప్రకారం ప్రతిరోజు ఎంత విక్రయించారు.. బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ పాతనోట్లను చేశారు.. అనే కోణాల్లో అధికారులు స్పష్టంగా విచారణ చేయడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు ఆదాయం పన్నుశాఖ అధికారుల వద్ద 128మంది ఖాతాదారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున వీరందరికీ నోటీసులతోపాటు దాడులు నిర్వహించి ఆదాయం పన్ను చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన 50మంది ఆదాయం పన్నుశాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు బయల్దేరి ప్రతి రోజు అక్రమ లావాదేవీలపై బ్యాంకుల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాంకులో డిపాజిట్ చేసిన పాతనోట్ల వివరాలు సేకరించి ఖాతాదారుల వద్ద జమచేసిన డబ్బు ఎక్కడి నుండి వచ్చింది.. వివరాలు తెలపాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వ్యాపార సంస్థల్లో విక్రయ బిల్లుల ప్రకారం నెలకు ఎన్ని రూపాయల సరుకులు విక్రయించారు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన పాతనోట్ల వివరాలు ఏమిటి అనే కోణంలో విచారిస్తున్నారు. గత 15రోజుల నుండి రెండు లేదా మూడు రోజులకోసారి అధికారులు ఈ ప్రాంతంలో దాడులు నిర్వహించి జన్‌ధన్ యోజన పథకంలో కొంతశాతం డబ్బు కట్టించి మిగతా ఆదాయపన్ను శాఖలో డబ్బులు జమ చేయిస్తున్నారు. మరికొందరికి నోటీసులు జారీ చేసి డిపాజిట్ వివరాలను తెలుపాల్సిందిగా కోరుతున్నారు. పూర్తి వివరాలతోనే అధికారులు సర్వేతోపాటు దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకుని ఆదాయం పన్ను చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
ఐటి ఉద్యోగినిపైవేధింపులు
గచ్చిబౌలి, మార్చి 25: మహిళలపై వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా.. పోకిరీలలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఐటి సెక్టార్‌లో అత్యధిక శాతం మహిళలు పని చేయడంతో పోలీసులు వారి భద్రతకు ప్రాధాన్యమిస్తుప్పటికీ అదే స్థాయిలో వేధింపులు కొనసాగుతున్నాయనడానికి తాజాగా శుక్రవారం రాత్రి ఓ ఐటి ఉద్యోగి వేధింపులకు గురికావడం ఇందుకు ఉదాహరణ. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఐటి ఉద్యోగిని పైబిఎండబ్ల్యూ కారులో వచ్చిన ఓవ్యక్తి సదరు మహిళను వేధించినట్టుతెలిసింది. సదరు వ్యక్తి అత్యంత సంపన్నుడు, రాకీయ పలుకుబడి ఉన్నందున పోలీసులు ఈవిషయాన్ని బయటకు పొక్కకుండా చూసినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసును షీ టీమ్‌కు అప్పగించినట్లు తెలిసింది. సదరు కారు యజమాని క్యాబ్‌లో వస్తున్న మహిళను వెంబడించి వేధించినట్లు తెలిసింది. అర్ధరాత్రి మహిళ షీ టీమ్‌ను అశ్రయిండంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సదరు వ్యక్తి పలుకుబడి ఉన్నవ్యక్తి కావడంతో పోలీసులు నిందితుని వివరాలు వెల్లడించేందుకు పోలీసులు జంకుతున్నారు. వాస్తవానికి కేసు మాదాపూర్‌లో అయినప్పటికి నిందితుని అదుపులోకి తీసుకుని పోలీసులు షీ టీమ్ అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై షీ టీమ్ ఇన్‌చార్జి సలీమాను వివరణ కోరగా తమకు ఎలాంటి కేసు రాలేదని మాదాపూర్ పోలీసులను అడగాలని చెప్పారు. మాదాపూర్ సిఐ కళింగారావుని వివరణ అడిగితే తమకు తెలియదని షీటీమ్ వారిని అడగాలని ఉచిత సలహా ఇచ్చారు. మహిళకు సంబంధించిన కేసును గోప్యంగా ఉంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తునట్లు ప్రచారం జరుగుతోంది.