రంగారెడ్డి

అర్హులకు సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 25: టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజలు, మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం చందానగర్‌లోని షాపుల్లో తిరుగుతూ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, నర్సింహ్మారావు పంతులు ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో తిరిగి సభ్యత్వం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొబ్బ విజయ్‌రెడ్డి, పోచయ్య, మల్లికార్జున్‌రావు, సులోచన, హరీశ్‌రెడ్డి, వెంకటేశ్, నాయకులు, కార్యకర్తలు, పలు దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.

బిఎఎస్ కోసం దరఖాస్తులు
వికారాబాద్, మార్చి 25: బెస్ట్ అవెయిలెబుల్ స్కూల్స్(బిఎఎస్) కోసం నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. కొత్తగా నాన్‌రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేవారు, చేసినవారు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరుతేది ఏప్రిల్ ఒకటో తేదీ అని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా కేంద్రంలోని మిషన్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో పొందాలని సూచించారు.
అధికారులు సమయపాలన పాటించాలి
పిఎసిఎస్ చైర్మన్ అవినాష్‌రెడ్డి
షాబాద్, మార్చి 25: అధికారులు సమయపాలన పాటించాలని పిఎసిఎస్ చైర్మన్ పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్య అధికారిణి స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం షాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి అధిక నిధులు కేటాయించి అసుపత్రిలో అన్ని వౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తునట్లు పేర్కొన్నారు.
కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా
బాలానగర్, మార్చి 25 : ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శివశంకర్‌నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలొని శివశంకర్‌నగర్ కాలనీలో డ్రైనేజీ పైపులైన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కార్పొరేటర్ పర్యటించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపోందించి త్వరలో నూతన పైపులైన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సత్తయ్యగౌడ్, గోపాల్, శాంతమ్మ, బస్వరాజ్, జగన్, సాయినాథ్‌గౌడ్, సురేందర్‌నాయుడు, రాములు పాల్గొన్నారు.
సభ్యత్వంలో మొదటిస్థానంలో నిలవాలి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
బాలానగర్, మార్చి 25 : టీ ఆర్ ఎస్ సభ్యత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే కూకట్‌పల్లి నంబర్ వన్‌గా నిలువాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బాలానగర్ డివిజన్ పరిధిలోని శోభన సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్యలు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి టిఆర్ ఎస్ సభ్యత్వం చేసుకునేందుకు మంచి స్పందన లభిస్తుందన్నారు. సభ్యత్వాలను ప్రజలు ఇష్టంతో స్వీకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల మోహన్‌రెడ్డి, మందడి సుధాకర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రభారెడ్డి,చంద్రపాల్, రాజుసాగర్, గౌస్, సయ్యద్ ఆహ్మద్‌అలీ, శంకర్‌గౌడ్, యలిజాల యాదగిరి, రవీందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.