రంగారెడ్డి

పేదింటి అమ్మాయికి అభయాస్తం కల్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 26: పేదింటి ఆడపడుచులకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం మంత్రి తాండూరు పట్టణంతో పాటు డివిజన్‌లోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్ మండలాలకు చెందిన మొత్తం 604 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
సభలో మంత్రి పట్నం మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, ప్రతి కుటుంబానికి సొంత ప్రయోజనం చేకూర్చాలనే సదాశయంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలనే మరో మహాత్తర కార్యక్రమం మిషన్ భగీరథ అని చెప్పారు. తాండూరు డివిజన్‌లో రూ. 2వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిచనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా రూ.55 కోట్ల నిధులతో జిల్లాలోని చెరువులు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు మరమ్మతులు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.500 కోట్లతో ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్ రోడ్లు నిర్మాణం పనులు చేపట్టామని అన్నారు. తాండూరు సమగ్రాభివృద్ధికి ఎన్ని వేల కోట్ల రూపాయలైన ఖర్చు చేస్తామని చెప్పారు. త్వరలో మంత్రి కెటిఆర్‌తో తాండూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసి తాండూరు పురోభివృద్ధికి భారీగా నిధులు రాబడుతామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి.సునీతా సంపత్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ, తాండూరు వికారాబాద్ ఆర్డీవో శివలింగం, మున్సిపల్ కమిషనర్ ఎన్.సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
కార్యాలయం ప్రారంభం
తాండూరు పట్టణంలోని పాత ఎడ్లబజార్ (కాటిల్ మార్కెట్) కాంపౌండ్‌లో ఉన్న భవనంలో మంత్రి మహేందర్ రెడ్డి.. హార్టికల్చర్, సెరీకల్చర్ తాండూరు డివిజన్ స్థాయి కార్యాయాలన్ని ప్రారంభించారు. డివిజన్‌లోని నాలుగు మండలాలకు చెందిన పలువురు రైతులకు మినీ ట్రాక్టర్‌లు కల్టివేటర్‌లను పంపిణీ చేశారు. ఆరుగురు లబ్ధిపొందినట్లు జిల్లా అధికారి సి.సంజయ్ కుమార్ వెల్లడించారు.

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలి

ఘట్‌కేసర్, మార్చి 26: అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాన్ని రూపొందించి అమలు పర్చాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి రవిచంద్రన్ అన్నారు. మండల కేంద్రంలోని కేవిఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం మూడవ మహాసభలు జరిగాయి. ఎఐటియుసి మండల క్యారదర్శి లొట్టి ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన మహాసభలో రవిచంద్రన్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను అమలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయినట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురి అవుతున్నారని, కనీస వేతనం లేకపోవటంతో పాటు భద్రతకు నోచుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. నిత్యం పనులు చేస్తున్న అర్ధాకలితో అలమటిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణరంగ సామర్ధ్యతను పెంచటానికి కార్మికులకు శిక్షణా సంస్థల ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించి నైపుణ్యతను పెంపొందించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మృతిచెందిన ప్రతి కార్మికునికి పది లక్షల రూపాయల పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు పరమేశ్వర్, మండల సిపిఐ కార్యదర్శి కల్లూరి జయచంద్ర, నాయకులు యాదయ్య, సంతోష్, చౌదరి, రామచంద్ర, ఈగల మల్లేష్, బాల్ద పెంటయ్య, వి.సురేంద్ర, దేవదాసు పాల్గొన్నారు.